Big Stories

After Marriage:వివాహం అయ్యాక మట్టి గాజులే వాడాలా…

After Marriage:మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొన్ని దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే .. ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీ దేవి నివాసం ఉంటుందని నమ్మకం. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుందట.

- Advertisement -

ముత్తైదువుల ఐదో తనానికి గుర్తుగా గాజులను భావిస్తారు. పెళ్లైన మహిళలు ఎక్కువగా ఆకుపచ్చ గాజులు ధరించేందుకు ఇష్టపడతారు. ఆకుపచ్చ రంగుకు హిందూ వివాహ క్రతువుకు విడదీయరాని సంబంధం ఉంది. భర్త సుదీర్ఘ ఆయుష్షు కోసం ఆ పరమశివుని ఆశీర్వాదం పొందడానికి ఆకుపచ్చ రంగు గాజులు మరియు ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు. మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో శుభకార్యాలకు పచ్చని గాజులను ధరించడం వల్ల శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఉత్తరప్రదేశ్ లో పెళ్లికూతురుకు ఎర్రని గాజులు శుభప్రదంగా భావిస్తారు.

- Advertisement -

అయితే కాలం మారుతున్న కొన్ని దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా .. వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, వేడుకలో సమయంలో సంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు.

ఆకుపచ్చ గాజులు.- అదృష్టాన్ని పెంచుతాయి
పసుపు రంగు- సంతోషాన్ని పెంచుతాయి
నీలం రంగు . -.విజ్ఞానాన్ని పెంచుతాయి
నలుపు రంగు -అధికారాన్ని కలిగిస్తాయి
ఎరుపు రంగు -శక్తిని పెంచుతాయి
నారింజ రంగు -విజయాన్ని అందిస్తాయి

Nagamalli Flower : భోళాశంకరుడు మెచ్చిన నాగమల్లి పుష్పం

MellaChervu Shivaya : మేళ్ల చెర్వు శివయ్య మహత్యం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News