BigTV English
Advertisement

Money:చీకటి పడ్డాక ఈ ఐదు పనులు చేయకూడదా..

Money:చీకటి పడ్డాక ఈ ఐదు పనులు చేయకూడదా..

Money:జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.


అప్పులివ్వద్దు
సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అదే విధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చెత్త వేయద్దు
సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంట్లో చెత్తను ఎట్టి పరిస్థితుల్లో బయట వేయకూడదు. కేవలం ఉదయం పూట మాత్రమే వేయాలి. మీరు పొరపాటున సాయంకాలం వేళలో చెత్తను బయటకు వేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు. అలాగే సాయంకాలం వేళలో మీ ఇంటికి ఎవరైనా ఆతిథ్యం స్వీకరించడానికి వస్తారో.. వారిని ఒట్టి చేతులతో బయటకు పంపకూడదు.


పాలు, పెరుగు ఇవ్వొద్దు
సూర్యుడు అస్తమించిన తర్వాత పాలు, పెరుగు, పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ చంద్రుడికి ప్రతీకగా ఉంటాయి. అందుకే సంధ్యా వేళలో తెల్లని వస్తువులను ఇవ్వరాదు. ఒకవేళ ఇస్తే మీకు మనశ్శాంతి అనేది కరువవుతుందని చాలా మంది చెబుతారు. వీటితో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా ఇవ్వకూడదు

తులసిని ముట్టుకోవద్దు
నిత్యం తులసి పూజ చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్యా వేళలో తులసిని తాకడం, తులసి ఆకులను తెంచడం వంటివి చేయకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట.

చీపురు వాడద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ సూర్యుడు అస్తమయం అయిన తర్వాత చీపురును పొరపాటున కూడా వాడరాదట. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా పరిగణిస్తారు. పొరపాటున మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు పోతుందని చాలా మంది నమ్ముతారు.

సాయంకాలం సంధ్యా వేళలో హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడొచ్చు.

Dharma Sandehalu:కోపంలో తల్లిదండ్రుల తిట్లు ఫలిస్తాయా…

Pooja:దేవుడి పవళింపు సేవలో ఉన్నప్పుడు పూజ చేయచ్చా…

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×