Chiranjeeva OTT : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ వస్తున్నాడు.. గత ఏడది ఒకేసారి ఆయన చేసిన సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. అయితే ఏ ఒక్క సినిమా కూడా హీరోకు మంచి టాక్ ను అందించలేదు.. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం చిరంజీవ.. ఈ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ మూవీ ఇవాళ ఓటిటిలో రిలీజ్ అయ్యింది.. చిరంజీవ మూవీ ఏ ఓటీటీలో కి వచ్చింది..? రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
హీరో రాజ్ తరుణ్, అదిరే అభి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ చిరంజీవ.. ఇక ఈ మూవీలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. రాజారవింద్ర, టేస్టీ తేజ, రచ్చ రవి, ఇమ్మాన్యుయల్ ఇతర పాత్రల్లో నటించారు. మైథలాజికల్ స్టోరీ తో పాటుగా కామెడీ కూడా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీపీ లో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో రిలీజ్ అయిన రాజ్ తరుణ్ సినిమాల కు ఈ మూవీ భిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈవారం కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ సినిమాని తప్పక చూసేయండి.
Also Read : ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?
చిరంజీవ మూవీ ఒక అంబులెన్సు డ్రైవర్ చుట్టూ తిరిగే కథ.. ఒకరోజు అంబులెన్స్ డ్రైవర్ అయినా శివ అనుకోకుండా ఎదురుగా ఉన్న ఒక దున్నపోతుని గుద్దేస్తాడు. దానివల్ల అతను కూడా ప్రమాదానికి గురవుతాడు. ఆ తర్వాతి రోజు నుంచి అతనికి తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారు, అవతలి వారి అయుష్షు ఎన్ని సంవత్సరాలు ఉందనే విషయం శివకు తెలిసిపోతుంటుంది. ఒకరోజు ఒక పెద్ద రౌడీని శివ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ శక్తులని ఎలా ఉపయోగిస్తే తనకి మంచి జరుగుతుందని ఆలోచించి ఆచరణలో పెడతాడు.. ఈ క్రమంలో అతను ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రాజ్ తరుణ్ సినిమాలంటే కామెడీకి కేరాఫ్.. మరి ఈ సినిమా కూడా అంతకుమించి కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని మేకర్స్ చెబుతున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. తాజాగా ఓటీటీ లోకి వచ్చిన ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇవాళ థియేటర్లతో పాటుగా, ఓటీటీలో కి కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.