Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకొని ఒక్కటయ్యారు అన్న విషయం తెల్సిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో వీరి వివాహాం జరగనుంది. గీత గోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం.. స్నేహంగా మారి.. ప్రేమగా ఎదిగి.. చివరికి పెళ్లితో ముగుస్తుంది. మొదటి నుంచి కూడా విజయ్ .. రష్మికకు సపోర్ట్ గా నిలబడుతూనే వస్తున్నాడు. ఎన్ని వివాదాలు వచ్చినా .. విమర్శలు వచ్చినా కూడా ఇద్దరు తట్టుకొని నిలబడ్డారు.
ముఖ్యంగా సినిమాల విషయంలో విజయ్ – రష్మిక ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. విజయ్ కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి రష్మిక.. ఆ సినిమాకు బెస్ట్ విషెస్ చెప్పుకొస్తుంది. హిట్ అయితే శుభాకాంక్షలు చెప్పడంలో ఎప్పుడు వెనుకాడదు. విజయ్ కూడా అంతే. రష్మిక ప్రతి సినిమాకు పరోక్షంగా తాను కూడా బాధ్యత తీసుకుంటాడు. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కూడా విజయ్ బెస్ట్ విషెస్ చెప్పుకొచ్చాడు.
“వాళ్ళు ఏదో శక్తివంతమైనది తీశారని నాకు తెలుసు. ముఖ్యమైనది ఏదో.. జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండే విషయం అని కూడా తెలుస్తుంది. అందరు నటీనటుల ప్రదర్శనలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని, రష్మిక, దీక్షిత్, అను ఇమ్మాన్యుయేల్ లతో రాహుల్ ఎంతో అద్భుతమైన కథను సృష్టించాడని నాకు తెలుసు. అది చాలా ప్రభావితం చేయబోతోందని కూడా తెలుసు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అదంతా మనం చూస్తాం. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అంటూ రాసుకోస్తూ ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ ను షేర్ చేశాడు.
ఇక తాజాగా విజయ్ పోస్ట్ పై రష్మిక స్పందించింది. తన సినిమా గురించి అంత గొప్పగా చెప్పడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాతో తాను.. విజయ్ ని గర్వపడేలా చేస్తానని చెప్పుకొచ్చింది. “ఇది శక్తివంతమైనది. ఇది ముఖ్యమైన విషయం. దీనిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది విజయ్ చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఈ సినిమా చాలా కాలంపాటు నెమ్మదిగా అందరి గుండెల్లో మండుతూ ఉంటుంది. విజయ్ ..మీరు ప్రారంభం నుండి పరోక్షంగా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ సినిమా తరువాత మీరు నా గురించి గర్వపడతారని నేను నిజంగా ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక వీరిద్దరి పోస్టులు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భార్య సినిమాకు విజయ్ బాగానే సపోర్ట్ ఇస్తున్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
It IS something powerful. It IS something important. It IS going to be hard to digest – So well put! ❤️
Thankyou ❤️It’s a SLOW BURN that LASTS LONG.
❤️@TheDeverakonda you’ve indirectly been a part of this film since the beginning and I really hope that you’ll be proud of me… https://t.co/DJCZb2zWZz— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025