Hong Kong Sixes 2025: ఇవాల్టి నుంచి హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ ( Hong Kong Sixes 2025 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. 6 ఓవర్ల ఈ టోర్నమెంట్ నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ కువైట్ ( Pakistan vs Kuwait, Pool C) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది ( Pakistan Star Abbas Afridi) విధ్వంసమే సృష్టించాడు. ఎవరు ఊహించని విధంగా సిక్సర్లతో రెచ్చిపోయాడు. కువైట్ తో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు అబ్బాస్. ఈ దెబ్బకు కువైట్ పై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ 2025 టోర్నమెంట్ లో భాగంగా కువైట్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో మ్యాచ్ జరిగింది. గ్రూప్ సీలో ఉన్న ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కువైట్ ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ విజృంభించి ఆడింది. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో నాలుగు వికెట్ల తేడాతో కువైట్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్.
అయితే ఛేజింగ్ చేసే క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కేవలం 12 బంతుల్లోనే 55 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు అలాగే ఒక బౌండరీ ఉంది. ముఖ్యంగా కువైట్ మ్యాచ్ లో యాసిన్ పటేల్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ( 6 Sixes In One Over) కొట్టాడు కెప్టెన్ అబ్బాస్ అఫ్రీది ( Pakistan Star Abbas Afridi). ఈ దెబ్బకు పాకిస్తాన్ విజయం సాధించింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ 2025 టోర్నమెంట్ లో చాలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్ లో ఆరు ఓవర్ల మ్యాచ్ లు మాత్రమే జరుగుతాయి. అంటే రెండు జట్లు కలిపి మొత్తం 12 ఓవర్లు ఆడుతాయి. ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారు. వికెట్ కీపర్ మినహా మిగిలిన వాళ్ళందరూ బౌలింగ్ చేయాలి. ఒకే ఒక్క బౌలర్ రెండు ఓవర్లు వేయాల్సి ఉంటుంది. 50 కి పైగా పరుగులు చేసిన ఆటగాడు రిటైర్డ్ నాటౌట్ కావాలి. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ 1:05 గంటలకు పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా దినేష్ కార్తీక్ వ్యవహరిస్తారు.
Abbas Afridi brilliant 55 Runs in just 12 balls#HongKongSixespic.twitter.com/muYmwvL6Ld
— Arxy 🇦🇪 (@ArxySays) November 7, 2025
🚨Big win for Pakistan against Kuwait in the Hong Kong Super Sixes! 🔥
They beat Kuwait by 4 wickets, with Abbas Afridi smashing six sixes in an over! 🤯#HongKongSixes pic.twitter.com/WjppEmAqTx
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 7, 2025