BigTV English

Different Gods : ఇంట్లో రకరకాల దేవుళ్లు పెట్టుకోకూడదా…?

Different Gods : ఇంట్లో రకరకాల దేవుళ్లు పెట్టుకోకూడదా…?

Different Gods : హిందుమతాన్ని ఆచరించే వాళ్లల్లో పూజామందిరం, దేవుళ్లు ఫోటోలు లేని ఇళ్లు ఉండవు. సొంతిల్లు ఉన్న వారు ఎంత చిన్న ఇల్ల‌యినా పూజ కోసం కొంత భాగాన్ని కేటాయించ‌డం హిందూ సంప్ర‌దాయం. చివ‌ర‌కు గూట్లో అయినా ఓ ప‌టాన్ని ఉంచి చిన్న దీపాన్ని వెలిగించాల‌నే చూస్తారు ఎవ‌రైనా. ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు.


స్థోమతను బట్టి మన ఇంట్లో చాలా అందంగా ఎంతో ఖర్చు పెట్టి దేవుని మందిరాన్ని కట్టిస్తాం. చూసిన వారందరూ ఆహా ఎంత దైవ భక్తులు అని మనల్ని పొగిడించుకోవాలన్న ఆలోచన కొందరిది. మనం ఎంత భక్తులమో మన అంతరాత్మకి తెలుసు. దేవుడికి నోరు లేదని దేవున్ని మోసగించడం పద్ధతేనా..

ఎన్ని రూపాల్లో ఉన్నా దేవుడు ఒక్కడే. భగవంతుడు సర్వాంతర్యామి. ప్రపంచంలోని అన్ని మతాలకు ఒక్కడే దేవుడున్నాడు. మనం కూడా దేవుడు కూడా ఒక్కడే అని చెబుతూ ఇంటినిండా దేవుని మందిరం నిండా రకరకాల దేవుడి బొమ్మలతో నింపేసి మనో నిశ్చలతను దూరం చేసుకుంటున్నాం. ఈ పద్ధతి ధ్యానానికి మంచిది కాదు. నోటితో చెప్పింది మనసుతో ఆచరించలేకపోతున్నాం.


దేవుని మందిరంలో ఒకే ఒక దేవుడ్ని పెట్టుకోండి. ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. శైవమతస్థులకు శివుడు ఒక్కడే దేవుడు. మరి ఇంట్లో ఏయే దేవుడి ఫోటోలను పెట్టుకోవాలన్న సందేహాలకు సమాధానం ఉంది .మ‌న ఇంట్లో ఉండాల్సిన మొట్ట మొద‌టి ఫోటో పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామి. పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామిని పూజించ‌డం వ‌ల్ల స‌క‌ల భూత ప్రేత పిశాచ భ‌యాల‌న్నీ ప‌టాపంచ‌ల‌వుతాయి. స్వామి వారి ఫోటో ఇంట్లో ఉన్నంత కాలం న‌ర‌ఘోష‌, చెడు ప్ర‌యోగాలు ఇంటి మీద ఎంత మాత్రం ప‌నిచేయ‌వు.

కొంతమందికి కులదైవం ఉంటుంది. ఇంటి పెద్దలు తరతరాలుగా ఆచారంగా కొలుస్తున్న దేవుడ్ని పూజించడం మంచిది. ఇంట్లో కాల‌భైర‌వుడు, శ‌నిభ‌గ‌వానుడు, నృత్యం చేస్తున్న న‌ట‌రాజ స్వామి, ఉగ్ర‌రూపంలో ఉన్న న‌ర‌సింహ‌స్వామి, దుర్గామాత ఫోటోల‌ను ఉంచుకోకూడ‌ద‌ు‌. అలాగే చాలా మంది పూజ గ‌దిలో శివ‌లింగాన్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇంట్లో పూజించే శివ‌లింగం ఎప్పుడూ బొట‌న వేలు సైజుకు మించి ఉండ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు.

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×