E-Paper
Advertisement

Neem Tree : ఇంట్లో వేప చెట్టును పెంచకూడదా..?

Neem Tree : ఇంట్లో వేప చెట్టును పెంచకూడదా..?
Advertisement
Neem Tree

Neem Tree : వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగాను ఇంటికి మేలు చేస్తుంది. ఈ చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుంది అని చెబుతూనే అసలు వేప చెట్టును ఇంట్లో పెట్టకూడదని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. వేప చెట్టుని ఇంట్లో పెంచితే అశుభ ఫలితాలనువస్తాయని పలువురు వాస్తు నిపుణులు చెబుతారు. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని పేర్లు ఇంటి గోడలలోకి పాకితే గోడలు నెర్రెలు బారతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్లను పెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు.

ఇంటికి సమీపంలో ఏ దిశలో పడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు. దక్షిణ దిశలోనే పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ రెండు దిశల్లో చెట్లను పెంచితే సుఖశాంతులు వెల్లి విరుస్తాయని చెబుతున్నారు. చాలామంది ఇంటికి తూర్పు వైపున, ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టేయాలని చాలామంది చెబుతూ ఉంటారు .

Advertisement

తూర్పు దిశలో వేపచెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వాస్తు దోషం తొలగి పోవాలంటే కూడా ఒక చక్కని రెమిడి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేస్తే మేలు జరుగుతుందంటున్నారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×