BigTV English

WPL : ముంబై హ్యాట్రిక్.. ఢిల్లీకి షాక్..

WPL : ముంబై హ్యాట్రిక్.. ఢిల్లీకి షాక్..

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై హ్యాట్రిక్ విజయాలు సాధించింది. మూడో మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మెగ్ లానింగ్ ( 41 బంతుల్లో 5 ఫోర్లతో 43 రన్స్ ), జెమీమా రోడ్రిగ్స్ ( 18 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు ) మాత్రమే కాస్త రాణించారు. రాధా యాదవ్ (10 రన్స్) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరారు. దీంతో ఢిల్లీ జట్టు ముంబై ముందు 106 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిచింది. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్ , సైకా ఇసాక్ , హేలీ మథ్యూస్ తలో 3 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీని కుప్పకూల్చారు. పూజా వస్త్రాకర్ కు ఒక వికెట్ దక్కింది.


స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు యాస్తికా బాటియా ( 32 బంతుల్లో 8 ఫోర్లతో 41 రన్స్ ), హేలీ మథ్యూస్ ( 31 బంతుల్లో 6 ఫోర్లతో 32 రన్స్) మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు అవుట్ తర్వాత నాట్ స్కివర్ బ్రంట్ ( 19 బంతుల్లో 4 ఫోర్లతో 23 నాటౌట్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( 11 నాటౌట్ ) అదే జోరును కొనసాగించారు. దీంతో ముంబై కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు పడగొట్టిన సైకా ఇషాక్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

WPLలో ముంబై జట్టుకు తిరుగు లేకుండా పోతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచి జోరుమీద ఉన్న ఢిల్లీ జట్టు కూడా ముంబై ముందు తలవంచింది. కనీసం పోటీ కూడా ఇవ్వకుండా చేతులేత్తేసింది. ఇక ఈ టోర్నిలో బెంగళూరు జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆ జట్టు ఢిల్లీ, ముంబై , గుజరాత్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ రెండు మ్యాచుల్లో ఓడగా.. యూపీ ఒక మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఈ రెండు జట్లు ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి.


Related News

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Big Stories

×