E-Paper
Advertisement

Remedies for Wealth: జీవితంలో రాజయోగం పట్టాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా ఈ చిన్న రెమెడీస్ పాటించాలట

Remedies for Wealth: జీవితంలో రాజయోగం పట్టాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా ఈ చిన్న రెమెడీస్ పాటించాలట
Advertisement

Remedies for Wealth: జీవితంలో రాజయోగం పట్టాలన్నా.. అష్టైశ్వర్యాలు కలగాలన్నా.. చిన్న చిన్న రెమెడీస్‌ పాటించాలని పండితులు సూచిస్తున్నారు. అసలు ఆ రెమెడీస్‌ ఏంటి..? ఎలా పాటించాలి..? ఎవరు పాటించాలి. వీటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిత్యజీవితంలో చాలా మంది చాలా రకాలైన కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాని వాళ్లు కొందరైతే.. ఉద్యోగం ఉన్నా నెల సంపాదన సరిపోక కష్టాలు పడేవాళ్లు మరికొందరు. ఎంత సంపాదించినా నెల తిరిగే సరికి ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఇబ్బందులు పడేవారు ఇంకొందరు. అలాగే ఎన్ని కోట్ల ఆస్తులున్నా.. మనఃశాంతి లేని వాళ్లు ఉంటారు. ఎంత మనఃశాంతి ఉన్నా జనంలో పలుకుబడి లేదని బాధపడేవాళ్లు ఉంటారు. అలాంటి వారి కోసమే శాస్త్రంలో చాలా పరిహారాలు ఉన్నాయంటున్నారు పండితులు. ఆ పరిహారాలు కూడా చాలా సింపుల్‌గా ఉంటాయంటున్నారు. ఆ సింపుల్‌ రెమెడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన..విరిగిన.. వస్తువులు పడేయండి. అలాగే ఇంట్లో బూజు దులపడం..శుభ్రం చేయడం లాంటివి చేయండి.

ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ.. అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి. ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడు కంటి తడి (ఏడవకూడదు) పెట్టకూడదు.

Advertisement

ప్రతిరోజూ ఇంట్లో చేసే పూజలో శ్రీ సూక్తం తప్పని సరిగా పారాయణ చేయండి. అలాగే పూజగదిలో తప్పని సరిగా ఏకాక్షి కొబ్బరికాయను ఉంచండి. దీని వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుందట. అలాగే మీరు పొదుపు చేయదలచుకుంటే భరణీ నక్షత్రం ఉన్న రోజు పొదుపు ప్రారంభించండి. దీంతో పొద్దుపు మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతుందట.

మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షితలు వేయండి. అలాగే నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు శ్రీ ఫలాలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు ఉంచండి.

మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? అయితే మీకు వచ్చిన లాభంలో పదిశాతం దాన ధర్మాలకు ఖర్చు చేయండి. అలాగే అవసరాన్ని మించి డబ్బు రానపుడు.

మీ కుల దైవానికి మొక్కులు చెల్లించంచండి. ఎపుడూ డబ్బుకు ఇబ్బంది అయితే వీలయినంత వరకు చిన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచండి. పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపై నుండి తిప్పి కూడలి లో వేసిరండి.

మీ దగ్గర ఎప్పుడూ రెండు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు జేబులో ఉంచుకోవడం వల్ల.. మీ జేబులో ఎప్పుడూ డబ్బులు ఉంటాయట. అలాగే మీ బెడ్‌ రూంలో మీరు నిద్ర లేచిన వెంటనే కనబడే విధంగా పసుపు, ఆకుపచ్చ రంగు కలిసిన ఏదైనా శుభకరమైన వస్తువును పెట్టుకోండి.

మీరు వాడే పర్సు వీలైనంత వరకు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఇంట్లో మహిళలు వీలైనంత వరకు ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు.. అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! ఎవరో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×