E-Paper
Advertisement

Mahabharata: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు.. అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! ఎవరో తెలుసా..?

Mahabharata: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు.. అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! ఎవరో తెలుసా..?

Mahabharata: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు ఆయనే..! అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! సింహాసనం మీద కూర్చోకపోయినా రాజ్యాన్ని తన కన్నుసైగలతో పాలించాడు. రాజ్యంలో ఏం జరిగినా పట్టనట్టు కూర్చునేవాడు. తను ఏదైనా అనుకుంటే మాత్రం వెంటనే జరిగేలా చేసేవాడు. చివరకు కౌరవ, పాండవులు కూడా ఆయన మాట కాదనే వారు కాదు. అంతటి పవుర్‌ఫుల్‌ వ్యక్తే భారతంలో అత్యంత దురదృష్టవంతుడు కూడా. ఎన్ని రాజ్యాలు, ఎన్ని రాజ భోగాలు ఉన్నప్పటికీ తనివితీరా అనుభవించే పరిస్థితి అయనకు ఉండేది కాదు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఆయన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ పురాణాలలో అద్బుతమైన కావ్యం మహాభారతం, తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అంటారు. అలాంటి మహాభారతంలో ఒకే ఒక వ్యక్తి అందరికన్నా అదృష్టవంతుడు, అదే వ్యక్తి అందరి కన్నా దురదృష్టవంతుడు. ఆయన ఎవరో కాదు ధృతరాష్ట్రుడు. అవును మీరు చదువుతున్నది నిజమే భారతంలో అత్యంత దరిద్రుడు, అత్యంత అదృష్టవంతుడు ధృతరాష్ట్రుడే. అయన ఎందుకు అదృష్టవంతుడు.. ఎందుకు దురదృష్టవంతుడో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు రాజభోగాలు:

ధృతరాష్ట్రుడికి రాజుగా అర్హత లేకపోయినా తమ్ముడైన పాండురాజు వల్ల రాజపీఠం దక్కింది.  పాండురాజు ప్రపంచాన్ని జయించి సంపదలు తెస్తే వాటిని అనుభవించాడు. గాంధారి ద్వారా నూట ఒక్క మంది సంతానాన్ని పొందాడు. పాండురాజు అనంతరం పాండవులు రాజ్యాలు గెలిచి సంపదలు తెచ్చిచ్చారు.. ధర్మరాజు పాలించినప్పుడు కూడా ధృతరాష్ట్రుడి మాట శాసనంగా భావించేవాడు. ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు  పాండవుల మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా మందలించేవాడు కాదు. పైగా రాజ్య కాంక్ష బాగా ఉండేదట. తదనంతరం అంతా కొడుక్కి ఇవ్వాలని తీవ్రమైన కోరిక వల్ల దుర్యోధనుడు ఏమి చేసినా ఏమి అనేవాడు కాదు.

అలా ధృతరాష్ట్రుడు పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు ఎటువంటి కష్ట ఎరుగడని చెప్పుకోవచ్చు. ఇక ఈ విశ్వంలోనే ఎవ్వరికి దక్కని అదృష్టం ధృతరాష్ట్రుడికి దక్కింది అదే శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం. పాండవుల తరపున రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడిని కౌరవులు బంధిస్తున్నారని తెలిసి కృష్ణుడు విశ్వరూపం ధరిస్తే.. అప్పుడు దృతరాష్ట్రుడు కోరిక మేరకు కొద్దిసేపు కళ్ళు ఇచ్చి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించాడు.  ఎంత దుర్మార్గుడైన శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం చేసుకోగలిగిన అదృష్టవంతుడు ధృతరాష్ట్రుడు.

ఎన్ని రాజభోగాలు ఉన్నా అనుభవించలేని దురదృష్టవంతుడు:

మహాభారతంలో ధృతరాష్ట్రుడి అంత దురదృష్టవంతుడు కూడా ఎవ్వరూ లేరనే చెప్పాలి. పాండురాజు కన్నా పెద్దవాడైనా ఒక్కనాడు కూడా తనివి తీరా కళ్లతో రాజ్యాన్ని చూసుకోలేని అంధుడు ధృతరాష్ట్రుడు. వంద మంది భార్యలు ఉన్నా వారితో సుఖానుభూతి పొందలేని దరిద్రుడు. వంద మంది కొడుకులను కన్నా.. వాళ్లను కళ్లతో చూసుకోలేని వ్యక్తి. యుద్దంలో  వారంతా చనిపోయినా ఇంకా కౌరవులు గెలిచారా అంటూ శ్రీకృష్ణుడిని అడిగిన రాక్షస స్వభావం కలిగిన వ్యక్తి ధృతరాష్ట్రుడు. నూరుగురు కొడుకులు అర్ధాయుష్కులుగా చనిపోయిన  బాధతో కుమిలిపోయిన వ్యక్తి ధృతరాష్ట్రుడు.

బహుశా ఏ పురాణాల్లోనూ ఏ ఇతిహాసంలోనూ ఇలాంటి వ్యక్తి కనిపించడు. ఒక్క మహాభారతంలో తప్ప. అందుకే ధృతరాష్ట్రుడు అత్యంత అదృష్టవంతుడు. అత్యంత దురదృష్టవంతుడు అని చెప్పవచ్చు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖం స్పెషల్ ఏంటో తెలుసా – ఇంకా ఎవరెవరు శంఖం పూరించేవారంటే..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×