E-Paper
Advertisement

Spiritual Wellness: చేత్తో అన్నం తినడంలో ఇంత సైన్స్ ఉందా? అరచేతిలో దాగున్న పంచభూతాల రహస్యం ఇదే!

Spiritual Wellness: చేత్తో అన్నం తినడంలో ఇంత సైన్స్ ఉందా? అరచేతిలో దాగున్న పంచభూతాల రహస్యం ఇదే!

Spiritual Wellness: బయటికి అందంగా కనిపించాలనే ఉద్దేశంతో పరిమళాలు, క్రీములు వాడుతుంటాం. కానీ తల నుంచి కాలి వేళ్ల వరకు ప్రతి అవయవం లోపల దాగి ఉన్న శక్తిని మాత్రం పెద్దగా పట్టించుకోము. అసలు మానవ శరీరం అనేది యంత్రం కాదు.. అది ప్రకృతి నిర్మించిన అద్భుత శక్తి వ్యవస్థ. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే.. నాలుక శ్రమ లేకుండా ఉచ్చరించే ‘ఓం’ మంత్రానికి ఉన్న ప్రభావం గురించి మనకు తెలుసు. అలాగే, మన అరచేతుల్లో కూడా అంతే లోతైన శక్తి దాగి ఉంది.

అరచేతిలోనే పంచభూతాల నివాసం:

మన చేతి వేళ్లు కేవలం పట్టుకోవడానికి మాత్రమే కాదు. ప్రతి వేలు ఒక మూలకానికి ప్రతీకగా భావించబడుతుంది. బొటనవేలు అగ్ని తత్వాన్ని, చూపుడు వేలు వాయు తత్వాన్ని, మధ్యవేలు ఆకాశ తత్వాన్ని, ఉంగరపు వేలు భూమి తత్వాన్ని, చిటికెన వేలు జల తత్వాన్ని సూచిస్తాయి. ఈ ఐదు వేళ్ల స్పర్శ ఏదైనా వస్తువును తాకినప్పుడు.. ముఖ్యంగా ఆహారాన్ని పట్టుకున్నప్పుడు ఆ మూలకాల సమతుల్యత చైతన్యమవుతుంది. అదే సమయంలో చేతి నరాల ద్వారా ఈ స్పందన మెదడుకు చేరి, అక్కడి నుంచి మళ్లీ శరీరమంతా వ్యాపిస్తుంది.

చేత్తో అన్నం తినడం సంప్రదాయం కాదు:

చేత్తో తినమని పెద్దలు చెప్పినప్పుడు.. దాన్ని మనం అలవాటు లేదా పాత పద్ధతి అనుకున్నాం. కానీ దాని వెనుక శాస్త్రం కూడా ఉంది. చేతులను ముందుగా నీటితో శుద్ధి చేసుకుని, వేళ్లతో అన్నం తినేటప్పుడు అరచేతిలోని శక్తి తరంగాలు ఆహారానికి స్పందిస్తాయని ఆయుర్వేద భావన చెబుతుంది. అన్నం జీర్ణక్రియకు అనుకూలంగా మారుతుంది. ఆహారంలో ఉన్న సూక్ష్మ లోపాలు కూడా కొంతవరకు తగ్గుతాయని నమ్మకం. ఈ రోజుల్లో స్పూన్లు ఫ్యాషన్ అయిపోయాయి కానీ.. శరీరం మాత్రం ఇంకా చేతి స్పర్శనే గుర్తుపడుతుంది.

చేతుల్లోని శక్తే మనల్ని నడిపిస్తుంది:

మన చేతి వేళ్లలో శక్తి నిక్షిప్తమై ఉండటం వల్ల, మనం ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం మనపై పడుతుంది. జపం చేసేవాళ్లు తులసి పూసలు చేత్తో తిప్పుతూ ఎందుకు జపం చేస్తారో ఇదే కారణం. మనసుకు ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి.. ఆ శక్తిని మళ్లీ చేతుల ద్వారానే మేల్కొలుపుతారు. కలం పట్టుకుంటే రాయాలని అనిపిస్తుంది, కర్ర పట్టుకుంటే అటూ ఇటూ తిప్పాలనిపిస్తుంది, చాకు పట్టుకుంటే ఏదైనా కోయాలనే ఆలోచన కలుగుతుంది. అది మన ఊహ కాదు.. చేతులు ఆ వస్తువు స్వభావాన్ని గ్రహించి, మనల్ని ఆ దిశగా ప్రేరేపిస్తాయి.

ఆశీర్వచనానికి ఉన్న లోతైన అర్థం:

పెద్దల పాదాలకు నమస్కరించినప్పుడు, వారు చేతిని తలపై ఉంచి ఆశీర్వదిస్తారు. అక్షింతలు వేస్తారు. ఆ క్షణంలో మనకు ఒక తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అది భావోద్వేగం మాత్రమే కాదు.. వారి చేతుల్లో ఉన్న శక్తి, పంచభూతాల సాక్షిగా మనపై పడినట్టు భావిస్తారు. అందుకే ఆశీర్వచనం అంటే మాటలు మాత్రమే కాదు.. అది శక్తి బదిలీ.

దేవారాధన, నాట్యం, యోగం అన్నీ చేతుల్లోనే:

పూజలు చేస్తున్న పండితులను గమనిస్తే.. దేవుడికి చేసే ప్రతి కైంకర్యం చేత్తోనే జరుగుతుంది. హారతి ఇవ్వడం, నైవేద్యం సమర్పించడం, మంత్రాల సమయంలో ప్రత్యేక ముద్రలు వేయడం ఇవన్నీ వేళ్లతోనే. భరతనాట్యం, కూచిపూడి లాంటి నాట్యాల్లో ముద్రలకు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. యోగ, ధ్యానంలో కూడా వివిధ ముద్రలు శక్తిని నియంత్రించడానికి ఉపయోగపడతాయి.

నీ జీవితం నీ చేతుల్లోనే:

చివరికి.. మన జీవిత గమనం చెప్పే రేఖలు కూడా అరచేతిలోనే ఉంటాయి. అందుకే హస్తసాముద్రికం ద్వారా జీవన ప్రయాణాన్ని అర్థం చేసేందుకు ప్రయత్నిస్తారు. ‘నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది’ అన్న మాటకు ఇదే అసలైన అర్థం. అందుకే అన్నం చేతితోనే తింటూ.. ఆ స్పర్శను ఆస్వాదించమని మన పెద్దలు చెబుతుంటారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×