BigTV English

Omkareshwar Temple: అద్భుతం శివ‌లింగాన్ని తాకిన సూర్య కిర‌ణాలు

Omkareshwar Temple: అద్భుతం శివ‌లింగాన్ని తాకిన సూర్య కిర‌ణాలు

Omkareshwar Temple: పవనపావనమైన కార్తీక మాసం అన్ని శాస్త్రములయందు కూడా అత్యంత మహీన్మాన్వితంగా ఆధ్యాత్మిక సాధనలకు అనువైన మాసంగా చెప్తారు. ఈ కార్తీకమాసంలో వివిధ దేవతారాధనలకు ప్రాధాన్యం ఉంది. ఇక కార్తీక మాసం వచ్చింది. ఆలయాల్లో పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయాల్లో భక్తుల పూజలతో సందడి నెలకొంది. ఆంధ్రేశ్‌లోని ఓ ఆలయంలో ఎన్నడూ లేని విధంగా అద్బుతం జరిగింది.  నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల శ్రీ ఓంకారేశ్వర దేవాలయంలో గర్భ గుడిలోని శివుడిని సూర్య కిరణాలు తాకాయి. ఉదయం ఆరున్నర నుంచి 20 నిమిషాల పాటు సూర్యకిరణాలు శివునిపై పడ్డాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దెత్తున తరలివెళ్లారు. పాడ్యము నుంచి అమావాస్య వరకు అంటే దాదాపుగా 30 రోజులు సూర్యకిరణాలు ప్రసరించబడుతాయి.


శివుడిపై సూర్య కిరణాలు పడగానే ఒక్కసారిగా దేవాలయం మొత్తం శివ నామస్మరణతో మార్మోగింది. 1464 లో ప్రతాపరుద్ర మహారాజు చేత నిర్మించిన ఈ ఆలయం గత 30 ఏళ్ల కిందట పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో కార్తీక , మాఘ , వైశాఖ మాసాల్లో అనేక భక్తి కార్యక్రమాలను పూజలను నిర్వహిస్తారు. కార్తీక మాసంలో సూర్యోదయం కు ముందే శివుడికి అభిషేకాలు , మహా మంగళ హారతి , తీర్థ ప్రసాదాలు సమర్పిస్తారు.

Also Read: రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి!


ఓంకారేశ్వర స్వామి దేవాలయం క్రీ.శ 18 వ శతాబ్ధంలో నిర్మించారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో బండి ఆత్మకూరు మండలంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో గంగా, ఉమా సిద్దేశ్వరి స్వామిగా పూజలు అందుకుంటున్న శివలింగాన్ని శ్రీ వేద రాశులు వారు ప్రతిష్టించారు. ఈ ఓంకార క్షేత్రంలో దసరా పండుగ నాడు జరిగే నవరాత్రులు, అలాగే కార్తీక మాసంలో జరిగే విశేష పూజలు శివరాత్రి నాడు జరిగే లింగ దర్శనాలు అంగరంగ వైభవంగాజరుగుతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఓంకారేశ్వర స్వామి ఆలయ పంచముఖ లింగ రూపంలో ఉన్న శివలింగంతో ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ కార్తీకమాసం శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×