E-Paper

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Sun Transit 2024: సెప్టెంబరు 16న తొమ్మిది గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం సూర్యడు సింహరాశిలో ఉన్నాడు. అయితే మరికొద్ది గంటల్లోనే సింహరాశి నుంచి బయటకు వచ్చి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దాదాపు 12 నెలల తర్వాత ఈ మార్పు జరగబోతోంది.

సూర్యుడు తన రాశిని మార్చుకోవడానికి సుమారు 12 నెలలు పడుతుంది. అలాంటి పరిస్థితిలోనే సెప్టెంబరు 16 న రాత్రి 7.43 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల ద్వంద్వ రాజయోగం కూడా ఏర్పడుతోంది. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం ఏర్పడతాయి. ఈ రాజయోగాలు వృషభరాశితో సహా ఇతర మూడు రాశుల వారికి ప్రయోజనాలను కలిగిస్తుంది. సూర్యుడి రాశిలో మార్పు వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. వృషభ రాశి వారికి సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కాలంలో, మీ కోరికలన్నీ నెరవేరతాయి. ఆఫీసుల్లో సీనియర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ సమయంలో అందరితో మీ సంబంధాలు బలపడతాయి. మీరు మీ జీవితాన్ని సమతుల్యం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యలుతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. మత పరమైన కార్యక్రమాల్లో పాల్లొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మిధున రాశి:
ఈ రాశి వారికి సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించడం వల్ల శాంతి, ప్రశాంతత లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో వస్తున్న సమస్యలన్నీ త్వరలోనే తీరుతాయి. ఉద్యోగం కోసం అక్కడక్కడ తిరుగుతున్న వారికి మంచి చోట ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం పెరుగుతుంది. మీరు భవిష్యత్తులో చాలా డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Also Read: శుక్రుడు, కేతువుల సంచారం.. వీరు తస్మాత్ జాగ్రత్త

కన్య రాశి:
గ్రహాల రాజు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తే, ఈ రాశి వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశించినా, ఆ రాశికి చెందిన వ్యక్తి యొక్క అన్ని కోరికలను ఈ సంచారం నెరవేరుస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అధిక లాభం ఉంటుంది. మీరు సీనియర్ల నుండి మద్దతు పొందుతారు. మీ పనికి ప్రశంసలు అందుతాయి. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పెరుగుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

అక్కడ పై కుండలోని అన్నం ముందెందుకు ఉడుకుతుంది? పూరీ జగన్నాథుడి వంటగది మిస్టరీ!

×