E-Paper
Advertisement

Venus-Ketu Conjunction: శుక్రుడు, కేతువుల సంచారం.. వీరు తస్మాత్ జాగ్రత్త

Venus-Ketu Conjunction: శుక్రుడు, కేతువుల సంచారం.. వీరు తస్మాత్ జాగ్రత్త
Advertisement

Venus- Ketu Conjunction: శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. శుక్రుడు ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే కన్యా రాశిలో కేతువు ఉన్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభాలను కలిగించనుంది. కన్యా రాశిలో శుక్రుడి సంచారం ఆగస్టు 25 వ తేదీన ఉదయం 01.24 నుంచి జరుగుతోంది. శుక్రుడు సింహ రాశిని వదిలి కన్యా రాశిలోకి ఆగస్టులో ప్రవేశించాడు. అంతుచిక్కని గ్రహం అయిన కేతువు ఇప్పటికే కన్యా రాశిలో సంచరిస్తున్నాడు.

కన్యా రాశిలో శుక్రుడు, కేతువుల కలయిక ఏర్పడనుంది. ఈ కలయిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల వారి జీవితాలన్ని ప్రభావితం చేస్తుంది.

Advertisement

శుక్ర, కేతువుల సంయోగం వల్ల ఇబ్బందులు..
రెండు గ్రహాల సంయోగం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్ర, కేతువుల కలయిక ప్రజలకు అంత మంచిది కాదు. శుభ, అశుభ గ్రహాల కలయిక తక్కువ సానుకూల ఫలితాలను ఇస్తుంది. రెండు గ్రహాలు కలిసి ఉండటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలకు కూడా ఇది కారణమవుతుంది. చక్కర స్థాయిని పెంచే సమస్యలు పెరుగుతాయి. పరస్పర సంబంధాలలో కూడా విభేదాలు కలుగుతాయి. ఈ కలయిక సంబంధాలలో గందరగోళాన్ని సృష్టిస్తుంది.

శుక్రుడు, కేతువుల కలయిక వివాహంలో ఇబ్బందులు లేదా ఆలస్యాన్ని కూడా కలిగిస్తుంది. సెప్టెంబర్ 18 మధ్యాహ్నం వరకు శుక్రుడు కన్యారాశిలో ఉంటాడు. దీని తర్వాత మధ్యాహ్నం 2: 04 గంటలకు తులా రాశిలోకి ప్రవేశించాడు. కన్యరాశిలో ఏర్పడే శుక్ర, కేతువుల కలయిక . సెప్టెంబర్ 18 శుక్రవారం ముగియనుంది.

Advertisement

వృషభం, కర్కాటకం, వృశ్చిక, కన్యారాశుల వారికి శుక్ర కేతువుల సంయోగం ప్రయోజనాలను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుక్రుడి ప్రభావంతో వృత్తి పురోగతి, కార్యాలయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది.

ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది .ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. వృతి పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బు, సంపదలో కొత్త మార్గాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: సెప్టెంబర్ 21 నుంచి.. వీరు శుభవార్తలు వింటారు.

కేతువు ఎప్పుడు సంచరిస్తుంది..
ఏడాది పొడవునా కేతువు కన్యారాశుల్లోనే సంచరిస్తాడు. దీనివల్ల మే 18. 2025 వరకు కన్యారాశి నుంచి బయటకు వెళ్లి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల 12 రాశులపై దీని ప్రభావం పడుతుంది. ఈ రాశిలో కేతువు సంచారం వల్ల సింహరాశి వారి పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×