E-Paper
Advertisement

Surya-Ketu Yuti 2024 : కన్యారాశిలో సూర్య-కేతుల కలయిక.. ఈ రాశులవారు చాలా లక్కీ

Surya-Ketu Yuti 2024 : కన్యారాశిలో సూర్య-కేతుల కలయిక.. ఈ రాశులవారు చాలా లక్కీ
Advertisement

Surya-Ketu Conjunction 2024 : వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాలు రాశులు మారినపుడు 12 రాశుల్లో జన్మించిన వ్యక్తుల జీవితాల్లో మార్పులు వస్తుంటాయి. అవి ఒక్కోసారి మంచివి కావొచ్చు.. మరొకసారి చెడు కావొచ్చు. 18 సంవత్సరాల తర్వాత కన్యారాశిలో సూర్య-కేతువుల కలయిక జరగబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 16న సూర్యుడు – కేతువులు కన్యారాశిలోకి ప్రవేశించనున్నారు. అక్టోబర్ 16 వరకూ ఆ రాశిలోనే సంచరించనున్నారు. ఈ కలయిక కొన్నిరాశుల వారికి మంచి ఫలితాలను అందించనుంది. వారు లక్షాధికారులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

సూర్యుడిని ధైర్యం, ఆత్మవిశ్వాసం, బలానికి కారణంగా భావిస్తారు. అలాగే కేతువును మోక్షానికి, ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా చూస్తారు. వీరిద్దరి కలయిక నింభయోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఇది మంగళకరమైనది కాకపోయినా.. మూడు రాశులవారికి మాత్రం మంచి ఫలితాలనిస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.

Advertisement

1. వృషభ రాశి

సూర్యుడు – కేతువుల కలయిక వృషభ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయిక కారణంగా వృషభరాశివారికి సంపద కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అలాగే విద్యారంగంలో గొప్ప విజయాలను సాధిస్తారు. గౌరవం కూడా పెరుగుతుంది.

Advertisement

2. సింహ రాశి

సూర్య-కేతువుల కలయిక సింహరాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఇంటిలో ఆనందం వెల్లివిరుస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసుకుంటారు. అప్పుల నుంచి బయటపడతారు. భవిష్యత్ పురోగతికి మార్గం తెరుస్తారు.

3. ధనస్సు రాశి

ఈ రాశివారు కూడా సూర్య-కేతువుల కలయికతో ప్రయోజనం పొందబోతున్నారు. ఈ సంయోగం జీవితంలో పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ అందుకుంటారు. వ్యాపారస్తులు ఆదాయం కోసం కొత్త మార్గాలను సృష్టించుకుంటారు. అలాగే గౌరవం కూడా పెరుగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×