E-Paper
Advertisement

Allu Sirish: మా అన్ననే నాకు బడ్డీ.. ఆయన ఒక రోబో..

Allu Sirish: మా అన్ననే నాకు బడ్డీ.. ఆయన ఒక రోబో..
Advertisement

Allu Sirish about Allu Arjun(Today tollywood news): అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరో అల్లు శిరీష్. అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇండస్ట్రీలో సపోర్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి అని అంటారు. ఎంత సపోర్ట్ ఉన్నా లక్ లేకపోతే కష్టం. అందులో అల్లు శిరీష్ కూడా ఒకడు.

కెరీర్ మొదటినుంచి కూడా శిరీష్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. విజయాపజయాలను పక్కనపెట్టి.. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ నటిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా బడ్డీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు శిరీష్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. మీ బడ్డీ ఎవరు.. పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి చెప్పండి అన్న ప్రశ్నకు శిరీష్ మాట్లాడుతూ.. ” నా బెస్ట్ బడ్డీ అంటే మా అన్న అల్లు అర్జునే. చిన్నప్పటినుంచి అన్ని అతనితోనే షేర్ చేసుకునేవాడిని. అన్ని విషయాలు ముందు అతనికే చెప్తాను.

ఇక పవన్ కళ్యాణ్ నుంచి మానసిక ధైర్యం నేర్చుకున్నా.. ఆయనకున్న మానసిక ధైర్యం ఎవరికి లేదు. ఇక చిరంజీవి ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు. అందరితోనూ ఎంతో మర్యాదగా మాట్లాడతారు. మా నాన్న అల్లు అరవింద్ ఒక రోబో. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలనుకుంటారు. ఒక భర్తగా, తండ్రిగా, ఫ్రెండ్ గా, బిజినెస్ మ్యాన్ గా ఏదైనా సరే వందశాతం బాధ్యతగా నిర్వర్తిస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×