BigTV English

Shiva Puja : శివపూజలో అందుకే శంఖాన్ని వాడకూడదా…..

Shiva Puja : శివపూజలో అందుకే శంఖాన్ని వాడకూడదా…..
Shiva Puja

Shiva Puja : పూజలో శంఖాన్ని ఉంచి పూజించడం వేల ఏళ్లుగా వస్తున్న హిందూ ఆచారాలు, సంప్రదాయాల్లో ఒకటి. అందరి దేవుళ్ల దగ్గర శంఖాన్ని ఉంచి పూజిస్తారు. కానీ ఒక పరమశ్వేరుడికి చేసిన పూజలో తప్ప మిగిలిన చోట్ల నిరంభ్యంతరంగా వాడుకోవచ్చు. శంఖచరుడు అనే రాక్షసుడ్ని శివుడు వధిస్తాడు, శంఖచరుడి ఎములతో తయారైందే శంఖం. శివుడి చేతిలో వధించబడటం వల్లే శంఖచరుడి ఎముకలతో పుట్టిన శంఖాన్ని ఉంచకూడదన్న పురాణ గాథ ప్రచారంలో ఉంది.


శంఖువు లక్ష్మీదేవికి ప్రతీక. పూజ గదిలో శంఖాన్ని ఉంచినప్పుడు పవిత్రంగా చూసుకోవాలి. నేరుగా నేలపై శంఖాన్ని పెట్టకూడదు. ఎరుపు రంగను బట్టను చుట్టి శంఖాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించాలి. ఒకవేళ్ల దాన్ని శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు పవిత్రమైన గంగా జలాన్ని మాత్రమే ఉపయోగించాలని పెద్దలు చెబుతుంటారు . ఆ నీళ్లతో శంఖాన్ని విష్ణు మూర్తి పాదాల దగ్గర ఉంచి పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక వేళ పొరపాటున శివుడి దగ్గర ఉంచి శంఖాన్ని పూజిస్తే కష్టాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. శంఖం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్టే లెక్క.

శంఖాన్ని రోజూ పూజించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. సాధారణంగా శంఖం లేని దేవతలను పూజించడం అసంపూర్ణంగా భావించాలి. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో శంఖం ఒకటని అంటారు. శంఖాన్ని పూరించడం వల్ల ఇంట్లో నెగిటివ్ శక్తులు ఇంటి నుంచి బయటకి పోతాయి. శంఖాన్ని పూరించడం ఆరోగ్యానికి మంచిది కూడా. నీటితో నింపిన శంఖాన్ని పూజ తర్వాత ఇంటి మొత్తం చల్లాతే పవిత్రత చేకూరుతుంది.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×