BigTV English

Varahi temple in Varanasi : వారణాసిలో విచిత్రమైన వారాహి ఆలయ రహస్యం

Varahi temple in Varanasi : వారణాసిలో విచిత్రమైన వారాహి ఆలయ రహస్యం
Varahi temple in Varanasi


Varahi temple in Varanasi : వారణాసిలోని వారాహి ఆలయం తెల్లవారజామున నాలుగున్నర గంటల తెరిచి ఉదయం ఎనిమిదన్నర గంటలకే మూసేస్తారు. మిగిలిన రోజంతా గుడిని మూసే ఉంచుతారు. ఈ ఆలయంలో అమ్మవారు భూగృహంలో ఉంటారు. దానికి రెండు రంద్రాలు లాంటివి ఉంటాయి. ఒక దాంట్లో అమ్మవారి పాదాలు మరో దాని నుంచి అమ్మవారి ముఖం కొంచెం మాత్రమే కనిపిస్తుంది. ఒకసారి దర్శనం చేసుకుని వెంటనే వెళ్లిపోవాలి. చూడటానికి చాలా చిత్రంగా ఉంటుంది ఈ ఆలయం. అమ్మవారిని చూసేందుకు భూగృహంలోకి వెళ్లకూడదన్న నియమం ఉంది. కారణం అమ్మవారు చాలా ఉగ్రరూపంలో ఉంటారట. అందుకే అమ్మవారిని పూర్తిగా చేసేందుకు ప్రయత్నించకూడదు.

అమ్మవారి తేజస్సును చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఆ పవర్ నుంచి తట్టుకోలేం కాబట్టే చూడకూడదంటారు. వరహస్వామి శక్తే వారాహి మాత. వారణాసికి గ్రామదేవత కూడా వారాహి అమ్మవారే. కాశీకి ఎలాంటి దుష్టశక్తుల రాకుండా కాపాడేందుకు వారాహి మాత సదా సిద్దంగా ఉంటుందట.. వారణాసిలో సూర్యాస్తమయం తరువాత వారణాసి వీధులన్నీ తిరిగి తెల్లవారజామును తన నివాస స్థానానికి అమ్మవారు చేరుకుంటారు. అందుకే తెల్లవారజామున నాలుగున్నరకే పూజరులు హారతి ఇచ్చి వెంటనే బయటకి వచ్చేస్తారు. సెల్లార్ మాత్రం మూసేసి రెండు కన్నాల నుంచి మాత్రమే అమ్మవారిని చూసేలా ఏర్పాట్లు చేస్తుంటారు.


దేవతల్లో ఒకరిద్దరు మాత్రమే ఉగ్రరూపాల్లో ఉంటారు. దుష్ట శక్తులు అంతు తేల్చేందుకు వీరు ప్రత్యేకంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. దుష్ట శక్తుల్ని పోరాడేందుకు ఉగ్రరూపం తప్పని సరి కాబట్టే అమ్మవారు ఉగ్రరూపంతోనే ఉంటారు. వారాహిని పూజిస్తే దుష్టనాశనం జరుగుతుంది. జంబుకేశ్వర్ లోని అఖిలాండేశ్వరి అమ్మవారు కూడా ఇలాగే ఉగ్రరూపంతో ఉండేవారట. ఆమెకి పూజలు చేయడం కూడా కష్టంగా ఉండేదట. ఆదిశంకరాచార్యులు ఆమెను ఉగ్రరూపం వదలమని ప్రార్ధించారట. మంత్రబలంతో ఉగ్రరూపాన్ని తగ్గించి శాంతరూపంగా మార్చారట. ఉపాసన శక్తి బలంగా ఎక్కువగా ఉన్నవారు మాత్రమే వారాహి మాతను నేరుగా దర్శించుకుని నిలబడగలరు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×