BigTV English

Surya Dev Favourite Zodiac: ఈ 2 రాశులు సూర్యదేవునికి ప్రీతిపాత్రమైనవి.. ఇందులో మీ రాశి కూడా ఉందా ?

Surya Dev Favourite Zodiac:  ఈ 2 రాశులు సూర్యదేవునికి ప్రీతిపాత్రమైనవి.. ఇందులో మీ రాశి కూడా ఉందా ?

Surya Dev Favourite Zodiac: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుని పాత్ర చాలా ముఖ్యమైనది. సూర్యుడిని నవగ్రహ రాజుగా పరిగణిస్తారు. సూర్యుని శుభ ప్రభావం వల్ల జీవితంలో విజయం, ప్రజాదరణ, విశ్వాసం పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో సూర్యుడు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం, ఏదైనా ప్రభుత్వ పని సరిగ్గా జరిగిందా లేదా అనే విషయంలో సూర్యుడి పాత్ర కూడా ముఖ్యమైనదని శాస్త్రం చెబుతుంది. సూర్యుని పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి, సూర్యుని శుభ ప్రభావం జీవితంలో గొప్ప మార్పులను తెస్తుంది. ఇక, సూర్యుని స్థానం అశుభం అయితే దాని ప్రభావం వల్ల జీవితంలో విపత్తులు వస్తాయి.


సూర్యునికి ఇష్టమైన రాశులు ఇవే..

సూర్యుడు సింహ రాశికి అధిపతి. అందుకే సింహ రాశి సహజంగానే సూర్యునికి ఇష్టమైన రాశులలో ఒకటి. ఇది కాకుండా, సూర్య భగవానుడు సాధారణంగా మేష రాశిలో కూడా తన శుభ ప్రభావాన్ని చూపిస్తుంటాడు. సూర్యుడు ఈ రెండు రాశుల వారికి ఉత్తమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి సాధారణంగా సింహ రాశి మరియు మేష రాశి వారు సూర్యుని ఆశీర్వదం పొందుతారు.


సింహ రాశి

జాతకంలో సూర్యుడు బాగా ఉంటే రాజులా జీవితాన్ని గడపవచ్చు. జీవితంలో అన్ని రకాల ఆనందం, విజయం మరియు శ్రేయస్సు పొందచవచ్చు. సింహ రాశికి అధిపతి గ్రహం సూర్యుడు అనే విషయం తెలిసిందే. కాబట్టి ఈ రాశి వారు సూర్యుని తేజస్సుతో, ధైర్యం మరియు విశ్వాసాన్ని పొందుతారు. అంతే కాదు ఈ రాశి వారు ఎల్లప్పుడూ సూర్యుని అనుగ్రహం పొందగలుగుతారు. సూర్యుని దయతో ప్రతి దానిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. ఈ రాశి వారికి ఏటువంటి లోటు ఉండదు. ఆర్థిక అంశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. సింహ రాశి వారు గొప్ప నాయకత్వ నైపుణ్యాలను కలిగి ఉంటారు. సహజ నాయకులుగా జీవిస్తారు. కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ వృత్తికి వెళ్లినా అందులో చాలా విజయాలు సాధిస్తారు. పూర్తి విశ్వాసంతో ఉంటారు. కష్టపడి పనిచేయగలరు. సింహ రాశి వారు చాలా దయగల స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేయడానికి ప్రయత్నిస్తారు.

మేష రాశి

మేష రాశి వారు సూర్యుని అనుగ్రహంతో అన్ని పనుల్లో విజయం పొందుతారు. నాయకత్వ స్వభావంతో జీవిస్తారు. ప్రతి విషయాన్ని చాలా స్వతంత్రంగా ఆలోచిస్తారు. ప్రతి దానిలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏం చేయాలని అనుకున్నా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కార్యాలయంలో ఎల్లప్పుడూ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంటారు. ఆర్థిక అంశాలు కూడా బలపడతాయి. అంతే కాదు కష్టపడి ఏదైనా సాధించాలనే నమ్మకం కలిగి ఉంటారు. మేష రాశికి సూర్యునితో సమానమైన ప్రకాశం మరియు ధైర్యం ఉంది. అయితే కోపం, మొండితనం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశి వారు కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×