Singer Chitra : తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు హీరో, హీరోయిన్లు ఎంత ముఖ్యమో.. సినిమాలోని పాటలు అద్భుతంగా రావాలంటే సింగర్లు అంతే ముఖ్యం.. ఇండస్ట్రీలోని కొందరు స్టార్ సింగర్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి పాటలకు అభిమానులు కూడా ఎక్కువే. అలాంటి స్పెషల్ సింగర్స్ లలో సింగర్ చిత్ర ఒకరు.. ఇప్పటివరకు ఈమె పాడిన పాటలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఎన్నో ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను రంజింప చేస్తుంది. అందుకే ఈ తరం సింగర్స్ అందరూ ఆమెను అమ్మగా భావిస్తారు. కొందరు చిత్రమ్మ అని పిలుస్తారు. ఈమె గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి.. తాజాగా అది నిజమేనని అందరు భావిస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ లో గాయపడ్డ సింగర్ చిత్ర..
ఇటీవల ఓ షోలో జడ్జిగా పాల్గొన్న ఈమె చేతికి కట్టుతో కనిపించడంతో ప్రమాదం నిజమేనని అందరూ నమ్ముతున్నారు. రీసెంట్ గా ఈమె మలయాళంలో వచ్చే స్టార్ సింగర్ 10వ సీజన్ షోలో చెన్నై ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.. చిత్ర మాట్లాడుతూ..హైదరాబాద్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగిన తర్వాత నేను కాస్త వెనక్కి జరిగాను అంతే కాలు బ్యాలెన్స్ తప్పి ట్రేకు తగిలి కింద పడ్డాను.. అది నాకు చాలా బాధగా అనిపించింది అని ఆమె అన్నారు.
Also Read : ‘ఎల్లమ్మ’ మూవీ కోసం రిస్క్ చేస్తున్న దిల్ రాజు.. అన్ని కోట్లా..?
ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..?
కింద పడినప్పుడు చెయ్యి బాగా నొప్పి వేసింది ఇక వెంటనే హాస్పిటల్ కి వెళ్ళానని చిత్ర అన్నారు. అప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. చిత్రమ్మ ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయింది. చిత్రమ్మ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఒక వైపు సినిమాలకు పాటలు పాడుతూనే, మరోవైపు పలు ఈవెంట్లకు జడ్జిగా వ్యవహరిస్తుంది..