BigTV English

Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే !

Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే !

Karthika Pournami 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు చాలా పవిత్రమైంది. ఈ సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి 15 నవంబర్ 2024 న జరుపుకోనున్నారు.


కార్తీక పూర్ణిమ హిందువులలో అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజు విష్ణువు, చంద్రుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. కార్తీక పౌర్ణమి పవిత్రమైన రోజులలో ఒకటిగా చెప్పబడుతుంది.ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి.. సత్యనారాయణుడి పూజిస్తారు.

దేశ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు గంగాస్నానం, దానధర్మాలు, పూజలు చేయడం వల్ల రెట్టింపు పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.


కార్తీక పౌర్ణమి రోజు పాటించాల్సిన నియమాలు:

ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజు భక్తులు స్నానం కోసం గంగా స్నానం చేయడం మంచిది. దీంతో జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా ఈ రోజు సత్యనారయణ వ్రతాన్ని ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

ఈ రోజు గంగా స్నానం చేసి దీపదానం చేసి నది ఒడ్డున మట్టి దీపం వెలిగించాలి. ఈ శుభ సందర్భంలో విష్ణువు, శివుని మంత్రాలను పఠించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కార్తీక పూర్ణిమ నాడు భగవద్గీత, రామాయణం, కార్తీక మాహాత్మ్య కథ వంటి మతపరమైన గ్రంథాలను తప్పనిసరిగా చదవాలి.

Also Read: శుక్రవారం రోజు ఈ పరిహారాలు చేస్తే.. అపార ధనలాభం

ఈ రోజు సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే సంప్రదాయం కూడా ఉంటుంది. కార్తీక పౌర్ణమి స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం. కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ 15 ఉదయం 06:19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 02:58 గంటలకు ముగుస్తుంది.

అదే సమయంలో.. ఈ రోజున నదీ స్నానం, దానం చేయడానికి శుభ సమయం ఉదయం 04.58 నుండి 05.51 వరకు ఉంటుంది. అలాగే చంద్రోదయం సాయంత్రం 04:51 గంటల వరకు ఉంటుంది.

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×