BigTV English

UK PM Keir Starmer : దీపావళి వేడుకల్లో మందు. మాంసం.. ఏకంగా ప్రధానికే తప్పని తిప్పలు

UK PM Keir Starmer : దీపావళి వేడుకల్లో మందు. మాంసం.. ఏకంగా ప్రధానికే తప్పని తిప్పలు

UK PM Keir Starmer : బ్రిటన్ ప్రధాని కీర్ టార్మన్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. భారతీయులు ఎక్కువగా ఉన్న బ్రిటన్ లో.. హిందూ సంప్రదాయలకు చాలా విలువనిస్తారు. కీర్ కంటే ముందు ప్రధానిగా ఉన్న రిషీ సునాక్ సైతం హిందువే కావడంతో.. అక్కడ మన పద్ధతులను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే 10-డౌనింగ్‌ స్ట్రీట్‌లో హిందువులు పవిత్రంగా జరుపుకునే దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. బ్రిటన్ ప్రధాని హిందువులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు.. వివాదానికి ఆ విందే కారణంగా నిలుస్తోంది.


బ్రిటన్ లో భారతీయుల సంఖ్య, ముఖ్యంగా హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విద్యా, ఉద్యోగావకాశాల కోసం నిత్యం యూకేకు చాలా మంది వలస వెళుతుంటారు. అందుకే.. హిందూ పండుగలను అక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే దీపావళి వేడుకల్ని అధికారికంగా నిర్వహించిన కీర్‌.. దీపాలు వెలిగించి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని కీర్‌ స్టార్మర్‌ హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. తన నివాసంలో రాజకీయ నాయకులు, హిందూ ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ మెనూలో మాంసం, మద్యం ఉండడంతో.. అంతా ఆశ్చర్యపోయారు.

బ్రిటన్ ప్రధాని కార్యాలయం చేసిన పనితో అక్కడికి వచ్చిన అతిథులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మన సంప్రదాయాలు, విలువలు తెలియకుండా.. పండుగలు నిర్వహించడమే ఏంటని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్‌ స్టార్మర్‌ వ్యవహరించాలని ఆగ్రహిస్తున్న బ్రిటన్ లోని హిందువులు.. ప్రధాని కీర్ టార్మన్ మూర్ఖత్వం ప్రదర్శించారని విమర్శిస్తున్నారు.


బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో దీపావళి వేడుకలు కొత్తేం కాదంటున్న అక్కడి హిందువులు.. 14 ఏళ్లుగా ప్రధాని అధికారిక నివాసంలో వేడుకలు జరుగుతున్నాయని గుర్తుచేస్తున్నారు. కానీ.. గతంలో ఎప్పుడూ ఇలా మాంసాహారం, మద్యం వంటివి ఇవ్వలేదని చెబుతున్నారు. దీపావళి వేడుకల్లో కీర్‌ స్టార్మర్‌ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహిస్తున్న హిందువులు.. ఈ పొరబాటుపై ప్రధాని కీర్‌ స్టార్మర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : భీకరంగా విరుచుకుపడిన అమెరికా యుద్ధవిమానాలు.. వారిలో మొదలైన వణుకు..

నాలుగు నెలల క్రితమే కీర్ స్టార్మర్ అధికార పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్ లో దాదాపు 14 ఏళ్ల పాటు పరిపాలించిన కన్జర్వేటివ్ పార్టీని ఓడించిన.. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ జూలై లో అధికారంలోకి వచ్చంది. ఈసారి 650 స్థానాలకు గాను 400 లకు పైగా సీట్లు గెలుచుకొని నూత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×