BSNL Best Recharge Plans : ప్రముఖ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తన కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలన్నీ విపరీతంగా టారిఫ్ ఛార్జీలను పెంచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ అందుబాటు ధరల్లోనే ప్లాన్స్ ను ఇస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మరొకసారి తన కస్టమర్ కోసం బెస్ట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చేసింది.
ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలైన జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా తమ టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం బిఎస్ఎన్ఎల్ సంస్థ రంగంలోకి దిగి అతి తక్కువ ధరలకే 4G, 5G ప్లాన్స్ ను అందిస్తుంది. ఇక మరోసారి బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలోనే కొత్త రీఛార్జ్ ప్లాన్స్ (BSNL New Recharge Plans) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది యూజర్స్ ను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా 4G, 5G మరింత విస్తృతం చేస్తూ అడుగులేస్తుంది. ఇక బిఎస్ఎన్ఎల్ తాజాగా తీసుకువచ్చిన ప్లాన్స్ కస్టమర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ ప్లాన్స్ ఏంటి? వాటితో పొందే లాభాలేంటో చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్స్ ( BSNL Yearly Recharge Plans) ను ది బెస్ట్ గా అందించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ కనిష్టంగా 336 రోజుల వ్యాలిడిటీ నుంచి 395 రోజులు ఉన్నాయి.
BSNL RS. 1198 Recharge Plan – ఈ ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా 300 నిమిషాల కాలింగ్ సదుపాయంతో పాటు 3GB డేటాను పొందవచ్చు. ఈ వ్యాలిడిటీ 365 రోజులు పాటు ఉంటుంది. 30 ఎస్ఎంఎస్ ప్రతీ నెలా వస్తాయి.
BSNL RS. 1499 Recharge Plan – ఈ రీఛార్జ్ ప్లాన్లో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. 336 రోజుల పాటు సాగే ఈ ప్లాన్ లో 24GB డేటా తో పాటు రోజువారి 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పొందవచ్చు.
BSNL RS. 1999 Recharge Plan – ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, రోజూ వంద ఎస్ఎంఎస్ లను ఉచితంగా పొందవచ్చు. ఇక డేటా పరంగా 600GB డేటా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ తో పాటు గేమ్స్ వంటివి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి.
BSNL RS. 2399 Recharge Plan – బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్ 395 రోజుల వాలిడిటీతో వచ్చేసింది. అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజువారి 2GB డేటా, 100 ఎస్ఎంఎస్ లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో బిఎస్ఎన్ఎల్ హార్డీ గేమ్స్, జింగ్ మ్యూజిక్, ట్యూన్స్ వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే. ఇక తక్కువ ధరలోనే బెస్ట్ రీఛార్జ్ ఆఫర్స్ పొందాలనుకునే కస్టమర్స్ కు ఇదే మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రై చేసేయండి.
ALSO READ : క్రోమ్ బుక్ Vs విండోస్ ల్యాప్టాప్.. 99% మందికి వీటి మధ్య తేడా తెలియదు