E-Paper
Advertisement

Vastu Tips: ఇవి మీ ఇంట్లో.. ఉండే డబ్బుకు లోటుండదు !

Vastu Tips: ఇవి మీ ఇంట్లో.. ఉండే డబ్బుకు లోటుండదు !
Advertisement

Vastu Tips: హిందూ సంస్కృతిలో.. ఇంట్లో దేవుడి విగ్రహాలు లేదా పవిత్ర వస్తువులను ఉంచుకోవడం అనేది కేవలం పూజ కోసమే కాదు, సానుకూల శక్తి , శాంతిని ఆకర్షించడానికి ఒక మార్గంగా చెబుతారు. వాస్తు శాస్త్రం ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక విగ్రహాలు, వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సుఖసంతోషాలు, సంపద, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఇంట్లో తప్పక ఉంచుకోవాల్సిన విగ్రహాలు, వస్తువులు, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గణపతి విగ్రహం:
ప్రాముఖ్యత: గణేశుడిని ‘విఘ్న నివారకుడు’ అని పిలుస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం ప్రారంభించినా.. లేదా ఏ పని చేపట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవ్వడానికి వినాయకుడిని పూజిస్తారు.

Advertisement

ఉంచే విధానం: గణేశుడి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉండే విగ్రహం (ఎడమ వైపునకు తిరిగిన తొండం శాంతి ,శ్రేయస్సుకు సూచిక) శుభప్రదం. ఇంటి ప్రధాన ద్వారం వైపు చూస్తూ ఉండేలా ఉంచడం మంచిది.

2. లక్ష్మీ దేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి/విష్ణువు విగ్రహం:
ప్రాముఖ్యత: లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సుకు దేవత.విష్ణువు పాలనకర్త.ఇద్దరి విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ధనంతో పాటు ధర్మం, శాంతి కూడా లభిస్తాయి.

Advertisement

ఉంచే విధానం: పూజా మందిరంలో ఈ విగ్రహాలను ఉంచడం శ్రేయస్కరం. సంపద కోసం లక్ష్మీదేవి పాదాలపై నమస్కరించేలా పూజించడం సాంప్రదాయం.

3. సాలగ్రామం :
ప్రాముఖ్యత: సాలగ్రామం అనేది సాక్షాత్తు విష్ణువు స్వరూపంగా భావించబడే ఒక పవిత్ర శిల. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అత్యంత దైవిక శక్తి , అపారమైన సానుకూలత ఇంట్లోకి ప్రవహిస్తుంది.

ఉంచే విధానం: దీనిని ఎల్లప్పుడూ పవిత్రమైన పూజా స్థలంలో ఉంచి, క్రమం తప్పకుండా పాలు లేదా గంగాజలంతో అభిషేకించి పూజించాలి.

4. తులసి మొక్క :
ప్రాముఖ్యత: తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా లేదా విష్ణుప్రియగా భావిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తులను పారదోలి, స్వచ్ఛమైన గాలిని, సానుకూలతను నింపుతుంది.

ఉంచే విధానం: ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో తులసి కోటను ఏర్పాటు చేసి, రోజూ దీపం వెలిగించి పూజించాలి.

5. కొలువు దీరిన శివలింగం :
ప్రాముఖ్యత: శివలింగం శివుని శక్తికి, సృష్టికి మూలానికి ప్రతీక. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్యం, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతాయి.

ఉంచే విధానం: ఇంట్లో ఉంచే శివలింగం బొటన వేలు పరిమాణంలో మాత్రమే ఉండాలి. దీనికి నిరంతరం జలాభిషేకం చేసే ఏర్పాటు ఉంటే మంచిది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×