E-Paper
Advertisement

Peddi: చికిరి చికిరి సాంగ్ వచ్చేసిందోచ్.. లిరికల్ కాదు ఏకంగా వీడియోనే.

Peddi: చికిరి చికిరి సాంగ్ వచ్చేసిందోచ్.. లిరికల్ కాదు ఏకంగా వీడియోనే.
Advertisement

Peddi:ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) తాజాగా బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో పెద్ది(Peddi ) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన విడుదల కాబోతున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇందులో జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.. అందులో భాగంగానే మొన్నా మధ్య ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. గత రెండు రోజుల క్రితం “చికిరి చికిరి” అంటూ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు బుచ్చిబాబు.

ఆకట్టుకుంటున్న చికిరి చికిరి వీడియో సాంగ్..

ఇకపోతే ఈ సినిమా నుండి వదిలిన ఈ అప్డేట్ చూసి లిరికల్ సాంగ్ వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించిన ఈ చికిరి చికిరి వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.చికిరి చికిరి అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చరణ్ లుక్స్ తో పాటు స్టెప్స్, పాట లిరిక్స్ అన్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను మోహిత్ చౌహన్ ఆలపించారు.

పెద్ది సినిమా విశేషాలు..

Advertisement

పెద్ది సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే మంచి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు భాషా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి బుచ్చి బాబు సన రచన, దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్, ఐవివై ఎంటర్టైన్మెంట్ కింద వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. శివరాజ్ కుమార్ పాత్రలో రామ్ చరణ్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే అతిలోకసుందరి అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా.. దివ్యేందు శర్మ, జగపతిబాబు, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రామ్ చరణ్ కెరియర్..

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్.. ఆ తర్వాత తన నటనలో మార్పులు తీసుకొస్తూ మెగా పవర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్నాయి. ఇటీవలే ఈ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను కూడా తొలగించిన విషయం తెలిసిందే. మరి పెద్ది సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Advertisement

 

ASLO READ:SSMB 29: హమ్మయ్య.. నేటి నుంచీ వరుస అప్డేట్స్.. ఈ రోజు స్పెషల్ పోస్టర్ తో..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×