BigTV English

Sourav Ganguly : వరల్డ్ కప్‌కంటే ఐపీఎల్ గెలవడమే కష్టం.. గంగూలి కామెంట్స్

Sourav Ganguly : వరల్డ్ కప్‌కంటే ఐపీఎల్ గెలవడమే కష్టం.. గంగూలి కామెంట్స్

Sourav Ganguly : రోహిత్ శర్మ.. ఇండియన్ టీమ్‌కు ఐసీసీ కెప్టెన్‌గా ఎంపికయిన తర్వాత ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రాఫీ ఇండియన్ టీమ్‌దే అని చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ అలా జరగలేదు. ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. దీంతో అప్పటినుండి క్రికెటర్లపై, వారి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ప్రముఖ మాజీ క్రికెటర్లు సైతం సెన్సేషనల్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అందులో ఇప్పుడు సౌరభ్ గంగూలి కూడా చేరారు.


ముందుగా రోహిత్ శర్మ కెప్టెన్సీ దగ్గర నుండి టీమ్ సెలక్షన్ వరకు అన్ని విషయాల్లో ఇండియన్ టీమ్ వెనకబడింది అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. టాస్ గెలిచిన తర్వాత రోహిత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోకుండా ఉండాల్సింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీమ్‌లోకి రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసుకోకపోవడంపై కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఆట ముగిసి మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా దీని గురించి చర్చలు మాత్రం ఆగలేదు.

చాలావరకు ఐసీసీ ట్రాఫీని దక్కించుకోకపోవడం వల్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మపై విమర్శలు ఎక్కువవ్వడంతో సౌరభ్ గంగూలి.. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేయాలనుకొని బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందని అన్నారు గంగూలి. రోహిత్ కెప్టెన్‌గా ఉన్న ఐపీఎల్ టీమ్ ముంబాయ్ ఇండియన్స్.. ఇప్పటివరకు 5 ట్రాఫీలు గెలుచుకోవడమే తన ఎంపిక వెనక ఉన్న కారణమని బయటపెట్టారు.


ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన సత్తా చాటుకున్న రోహిత్ శర్మ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా ప్లేయర్‌గా మంచి పర్ఫార్మెన్స్‌ను కనబరిచాడని అన్నారు గంగూలి. అంతే కాకుండా తను ఏషియన్ కప్ కూడా గెలిచాడని గుర్తుచేసుకున్నారు. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓడిపోయినా కూడా ఫైనల్స్ వరకు చేరి గట్టి పోటీని ఇచ్చిందన్నారు. అందుకే రోహిత్ మీద తనకు నమ్మకం ఉందన్నారు. అంతే కాకుండా ఐపీపీ అనేది కష్టమైన టోర్నమెంట్ అని, దానిని గెలవడం కష్టమన్నారు. వరల్డ్ కప్ గెలవడం కంటే ఐపీఎల్ గెలవడమే కష్టమని, ఎందుకంటే ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఉంటాయని చెప్పారు. దీంతో గంగూలి మాటలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×