BigTV English

Tirumala News: శ్రీవారి భక్తులకు సూచన.. దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ మార్పు, కొత్తగా ఎక్కడంటే

Tirumala News: శ్రీవారి భక్తులకు సూచన..  దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ మార్పు, కొత్తగా ఎక్కడంటే

Tirumala News: కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది తిరుమల. శ్రీవారిని దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతలో కొంతైనా తొలగుతాయని భక్తుల ప్రగాడ నమ్మకం. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామిని నిత్యం అక్కడికి వేలల్లో భక్తులు వస్తుంటారు.


ఏ చిన్న మార్పుల చేసినా భక్తులు కాస్త ఇబ్బందులకు గురవుతారు. అందుకే ముందుగానే భక్తులకు సమాచారం ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తాజాగా భక్తులకు కీలక అప్‌డేట్స్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు కీలక సమాచారం అందించింది.

ప్రస్తుతం శ్రీవారి మెట్టు వద్ద ఇస్తున్న దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. శ్రీవారి మెట్టు నుంచి తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు మార్చుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. నూతన కౌంటర్లు జూన్ 6 సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో భక్తులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని వెల్లడించింది.


నార్మల్‌గా స్వామిని దర్శించుకునేవారికి టికెట్లు లేకపోవడంతో దివ్యదర్శనం టోకెట్ల కోసం ఎగబడతారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు వరకు వెళ్తుంటారు. వారిని ముందుగానే అలర్ట్ చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్‌లో నిర్దేశించిన కౌంటర్ల నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుకానుంది.

టోకెన్ల లభ్యతను బట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ (ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన) టోకెన్లను కేటాయించనుంది. శనివారం శ్రీవారి దర్శనం కోసం టోకెన్లను శుక్రవారం సాయంత్రం మంజూరు చేస్తారు. భక్తులు తమ ఆధార్ కార్డును చూపించి దివ్య దర్శనం టోకెన్లను పొందాలి.

దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారిమెట్టు మార్గంలో 1,200వ మెట్టు వద్ద స్కానింగ్ పాయింట్‌లో తమ టోకెన్‌ను స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్కానింగ్ లేకుంటే వారిని దర్శనానికి అనుమతించరు. కచ్చితంగా స్కానింగ్ చేయాల్సిందే. కేవలం దివ్యదర్శనం టోకెన్లు కాకుండా, సర్వ దర్శనం టోకెన్లను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో కౌంటర్ల ద్వారా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×