RCB PBKS JioHotstar| ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఈ సారి చాలా రికార్డ్‌లు నమోదయ్యాయి. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీతో కలిసి రజత్ పటీదార్ నాయకత్వంలో బెంగళూరు జట్టు 18 సంవత్సరాల నిరీక్షణకు స్వస్తి పలికింది.
మొదట బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. ఆర్‌సీబీని 190/9 స్కోరుకు కట్టడి చేసింది. అర్ష్‌దీప్ సింగ్ (3/40), కైల్ జామీసన్ (3/48) పంజాబ్ తరపున మంచి ఆటతీరు కనబరుస్తూ.. బౌలింగ్ చేశారు. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. వికెట్లు క్రమంగా కోల్పోయింది. అయితే 191 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ లో కాస్త చతికలపడింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/38), కృనాల్ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్‌తో పీబీకేఎస్‌ను 20 ఓవర్లలో 184/7 కే పరిమితం చేశారు.
ఆర్సీబీ vs పీబీకేఎస్ ఫైనల్ మ్యాచ్.. జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయింది. దేశంలో దాదాపు సగం జనాభా ఈ మ్యాచ్ వీక్షించింది. మొదటి ఇన్నింగ్స్ సమయంలో 57.8 కోట్ల మంది (578 మిలియన్లు) ఈ మ్యాచ్‌ను చూశారు. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలో జియో హాట్‌స్టార్ 35 శాతం వ్యూయర్ షిఫ్ పెరుగుదలను నమోదు చేసింది. మొదటి వారాంతంలో 137 కోట్ల వ్యూస్ సాధించింది.
జియో హాట్‌స్టార్‌లో మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉన్నాయి. ‘మొబైల్’ ప్లాన్ (యాడ్స్‌తో పాటు) 3 నెలలకు ₹149, సంవత్సరానికి ₹499, ఒక మొబైల్ డివైస్‌లో చూడొచ్చు. ‘సూపర్’ ప్లాన్ (ప్రకటనలతో) 3 నెలలకు ₹299, సంవత్సరానికి ₹899, రెండు డివైస్‌లలో స్ట్రీమింగ్ చేయొచ్చు. ‘ప్రీమియం’ ప్లాన్ (ప్రకటనలు లేకుండా) నెలకు ₹299, 3 నెలలకు ₹499, సంవత్సరానికి ₹1,499, నాలుగు డివైస్‌లలో చూడొచ్చు.
ఆర్సీబీ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. “ఆర్‌సీబీ చారిత్రాత్మక ఐపీఎల్ విజయం సాధించింది! కల నెరవేరింది – ఈ సలా కప్ నమ్దే!” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ విజయం కర్ణాటకకు గర్వకారణమని, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉత్తేజపరిచిందని ఆయన అన్నారు. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఆర్‌సీబీ అహ్మదాబాద్‌లో ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.
Also Read: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?..
సంతోషంతో కన్నీరు పెట్టిన కొహ్లీ
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల భావోద్వేగ క్షణం వీడియో వైరల్‌గా మారింది. విరాట్ తన భార్య అనుష్క మైదానంలోకి రావడం కోసం ఎదురుచూసి, ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్లలోనూ కన్నీళ్లు కనిపించాయి. తర్వాత అనుష్క, విరాట్‌తో కలిసి ఆర్‌సీబీ జట్టు మేనేజ్‌మెంట్, ఆటగాళ్లను అభినందించడానికి వెళ్లింది.
Anushka Sharma calming down Virat Kohli as he got emotional. ❤️🥹#RCBvsPBKS #IPLFinals pic.twitter.com/Vezlq8QmkR
— Akshat Om (@AkshatOM10) June 3, 2025