OTT Movie : బ్యాంకాక్ లోని చైనా టౌన్ లో రహస్యాలు, మోసాలు, ఒక దారుణమైన హత్య చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. పోలీస్ అకాడమీలో రిజెక్ట్ అయిన యువకుడు కిన్ ఫెంగ్, తన “అంకుల్” టాంగ్ రెన్‌ని కలవడానికి వస్తాడు. అతను చైనా టౌన్ లో నంబర్ వన్ డిటెక్టివ్ గా పేరు గాంచినవాడు. కానీ, ఈ డిటెక్టివ్ ఒక స్లీజీ మోసగాడని తెలిసినప్పుడు, ఒక బంగారం దొంగతనం కేసు వాళ్ళను సమస్యల్లోకి లాగుతుంది. ఈ గోల్డ్ రాబరీ, హత్య, టాంగ్ రెన్ జీవితంలోని బాధాకరమైన గతం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయా? అనే విషయాలు తెలియాలంటే ఈ సస్పెన్స్‌ఫుల్ కామెడీ రైడ్ స్టోరీపై ఓ లుక్కేద్దాం.
కథలోకి వెళ్తే…
కిన్ ఫెంగ్ (లియు హోరన్), పోలీస్ అకాడమీలో రిజెక్ట్ అయిన తర్వాత విహార యాత్ర కోసం బ్యాంకాక్ లోని చైనా టౌన్ కు తన “అంకుల్” టాంగ్ రెన్ (వాంగ్ బావోకియాంగ్) దగ్గరకు వెళతాడు. టాంగ్ రెన్, చైనా టౌన్ లో నంబర్ వన్ డిటెక్టివ్ గా తనకు పేరుందని చెప్పుకుంటాడు. కానీ నిజానికి అతను ఒక చిన్న మోసగాడు. పైగా అసమర్థ పోలీస్ సార్జెంట్ కోన్ తాయ్ (జియావో యాంగ్) అండదండగా బతుకుతుంటాడు. ఇంతలో ఒక బంగారం దొంగతనం కేసులో ప్రధాన నిందితుడైన సోంపత్ హత్యకు గురవుతాడు. అలాగే బంగారం మిస్ అవుతుంది. ఈ బంగారం స్థానిక గ్యాంగ్‌స్టర్ మిస్టర్ యాన్ (చిన్ షిహ్-చియె)ది. ఈ కేసును ఛేదించడానికి కోన్ తాయ్, అతని ప్రత్యర్థి హువాంగ్ లాన్‌డెంగ్ (చెన్ హే) మధ్య పోటీ మొదలవుతుంది.
టాంగ్ రెన్, ఒక అనామక డెలివరీ జాబ్ తీసుకున్న తర్వాత, సోంపత్ హత్య సీన్‌లో చివరిగా కనిపిస్తాడు. దీంతో అతను పోలీసులకు, దొంగలకు ప్రధాన నిందితుడవుతాడు. కిన్ ఫెంగ్, తన అసాధారణ జ్ఞాపకశక్, పరిశీలన సామర్థ్యాలతో, టాంగ్ ను రక్షించడానికి కేసులోకి దిగుతాడు. వాళ్ళు టాంగ్ లవ్ ఇంటరెస్ట్ అయిన షియాంగ్ (టాంగ్ లియా)ను రక్షించడం, హత్య రహస్యాన్ని ఛేదించడం, బంగారాన్ని కనుగొనడం కోసం బ్యాంకాక్ వీధుల్లో సాహసయాత్ర చేస్తారు. దర్యాప్తులో, టాంగ్ గతంలోని బాధాకరమైన సంఘటన.. తన భార్య పెళ్లి రోజున ద్రోహం చేసిన సంఘటన బయట పడుతుంది. దీంతో అతను చైనాను విడిచి బ్యాంకాక్ కు ఎందుకు వచ్చాడనేది తెలుస్తుంది. చివరి క్షణాల్లో, సోంపత్ హత్య వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. సోంపత్ ఒక బాధితురాలిపై అఘాయిత్యం చేసిన ఘటన, ఆమె స్టెప్ ఫాదర్ చేసిన హత్య, బంగారం దొంగతనం ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న కేసులేనా? ఈ కేసు క్లైమాక్స్ ఎలా ముగిసింది? అన్నది తెరపై చూడాల్సిన స్టోరీ. ఈ కథ కామెడీ, యాక్షన్, ఎమోషనల్ గా నడుస్తుంది.
Read Also : ముగ్గురితో ప్రేమ… అందం ఎరవేసి భర్తనే లేపించేసే భార్య.. ఈమె పెద్ద నెరజాణ గురూ!
ఏ ఓటీటీలో ఉందంటే ?
ఇప్పుడు మనం చెప్పుకున్న క్రైమ్ కామెడీ డ్రామా పేరు “Detective Chinatown”. 2015లో రిలీజ్ అయిన చైనీస్ కామెడీ-మిస్టరీ బడ్డీ ఫిల్మ్ ఇది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. చెన్ సిచెంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైంది. 136 నిమిషాల నిడివితో, వాంగ్ బావోకియాంగ్ (టాంగ్ రెన్), లియు హోరన్ (కిన్ ఫెంగ్), జియావో యాంగ్ (కోన్ తాయ్), చెన్ హే (హువాంగ్ లాన్‌డెంగ్), టాంగ్ లియా (షియాంగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. బ్యాంకాక్ చైనా టౌన్‌లో షూట్ చేసిన ఈ సినిమా యాక్షన్, కామెడీ, మిస్టరీ జానర్‌లలో ఉంటుంది. IMDbలో 6.6/10 రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా స్లాప్‌స్టిక్ కామెడీ, మార్షల్ ఆర్ట్స్, మరియు షెర్లాక్ హోమ్స్ స్టైల్ సీన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.