Gouri Kishan Body Shaming Controversy: తమిళ నటి గౌరీ కిషన్‌కు ప్రెస్ మీట్ చేదు అనుభవం ఎదురైంది. మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన తనని బాడీ షేమింగ్ చేస్తూ ఓ జర్నలిస్ట్ అనుచితంగా ప్రవర్తించిన సంఘటన ఇండస్ట్రీ తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆమెకు తమిళ్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోవైపు సదరు జర్నలిస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ప్రెస్ క్లబ్ కూడా గౌరీ కిషన్‌కు మద్దతు తెలిపింది. ఈ వివాదంపై స్పందిస్తూ సదరు జర్నలిస్ట్ తీరును తీవ్రంగా ఖండించంది.
గౌరీ కిషన్ నటించని లేటెస్ట్ మూవీ ‘అదర్స్’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మూవీ టీంతో పాటు ప్రధాన నటీనటులు ఆదిత్య మాధవన్, గౌరీ కిషన్ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ నుంచి గౌరీ కిషన్‌కి అనుచితమైన ప్రశ్న ఎదురైంది. సమావేశంలో అందరి ముందు బహిరంగంగా ‘నీ బరువెంత ఉంటుంది?’ అంటూ బాడీ షేమింగ్ చేశాడు. అయితే వెంటనే సదరు జర్నలిస్ట్ ప్రశ్నను తనదైన స్టైలో తిప్పి కొట్టింది గౌరీ కిషన్. తన ప్రశ్నను సమర్థించుకుంటూ గౌరీతో వాదనకు దిగారు సదరు జర్నలిస్ట్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సదరు జర్నలిస్ట్ తీరును తప్పుబడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం నటి గౌరీ కిషన్ మద్దతు తెలుపుతున్నారు.
అంతేకాదు ప్రెస్‌మీట్ లో మహిళ నటులను అడిగే ప్రశ్నలేనా? కొంచమైన బుద్దిందా? అంటూ అతడిపై భగ్గమంటున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహరంలో చెన్నై ప్రెస్ క్లబ్ కూడా స్పందించింది. సదరు జర్నలిస్ట్ ప్రశ్నను తీవ్రంగా ఖండిస్తూ.. తనని తాను డిఫెండ్ చేసుకున్న గౌరీ కిషన్ తీరుని అభినందిచింది. అయితే గౌరీ కిషన్ తన ప్రశ్నతో ఇబ్బంది పెట్టింది ఆర్‌ఎస్ కార్తిక్ అనే ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ అని ప్రెస్‌క్లబ్ స్పష్టం చేసింది. నటి గౌరీ కిషన్‌కు తన శరీర బరువు గురించి అనుచితమైన ప్రశ్న వేసిన యూట్యూబర్ ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెన్నై ప్రెస్‌క్లబ్ తమ ప్రకటనలో పేర్కొంది. అలాగే “ఒక మహిళ నటి శారీరక రూపాన్ని, ముఖ్యంగా సినిమా గురించి చర్చించడానికి ఉద్దేశించిన ప్రొఫెషనల్ ఫోరమ్‌లో ఆమెశరీరాకృతిని ఎగతాళి (Body Shaming) చేయడం లేదా అవమానించడం లక్ష్యంగా ప్రశ్నలు లేవనెత్తడం అనైతికం.
Also Read: The Girlfriend Movie: కన్నడ హీరో, హీరోయిన్లు.. తమిళ డైరెక్టర్.. తెలుగు సినిమా చేస్తే
ఇది సహించరాని చర్య. గౌరీ కిషన్ తన అసౌకర్యాన్ని, అభ్యంతరాన్ని స్పష్టంగా వ్యక్తం చేసినప్పటికీ, యూట్యూబర్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటు ఆమెతో వాదనకు దిగారు. ప్రెస్ క్లబ్ ఇలాంటి చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. నటీనటులను అసభ్యకరమైన ప్రశ్నలతో ఇబ్బంది గురిచేస్తున్నప్పుడు సహా జర్నలిస్టు వెంటనే స్పందించి ఈ చర్యలను ఖండించాలి. ఈ ప్రెస్ మీట్ తనకు ఇబ్బంది కలిగించే ప్రశ్న వేసినప్పటికీ దానిని సమర్థవంతంగా ఎదుర్కున్న నటి గౌరీ కిషన్‌ని ధైర్యాన్ని మా ప్రెస్ క్లబ్ అభినందిస్తుంది” అని లేఖలో రాసుకొచ్చారు. దీనికి గౌరీ కిషన్ షేర్ చేస్తూ చెన్నై ప్రెస్ క్లబ్‌కి ధన్యవాదాలు తెలిపింది. అలాగే చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించారు. ప్రెస్ క్లబ్ రిలీజ్ చేసిన పత్రిక ప్రకటనను షేర్ చేస్తూ.. “సానుకూల మార్పులను చూడటం మంచిది. ఇది అపూర్వమైనది” అంటూ కామెంట్స్ చేసింది.