Big Stories

Tirupati Teppotsavam : మే 31 నుంచి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

- Advertisement -

Tirupati Teppotsavam : తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ముహూర్తం ఖరారైంది. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీపి కబురు అందించింది. మే 31 నుంచి జూన్ నాలుగో తేదీ వరకు ఐదు రోజు ల పాటు కన్నుల పండుగగా తెప్పోత్సాలు నిర్వహించనుంది. ఉత్సవాల సమయంలో అమ్మవారు నిత్యం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఏడున్న వరకు సరోవరంలో తెప్పలపై విహరిస్తూ భక్తుల్ని దర్శన భాగ్యం కలిగించనున్నారు.

- Advertisement -

శ్రీ అలివేలు మంగ‌మ్మ ప‌ద్మ స‌రోవ‌ర తీరంలో ఐదు రోజులపాటు పాంచరాత్ర ఆగ‌మ పూజ‌లు అందుకుంటారు. ప్ర‌తి ఏటా అమ్మ వారికి జ్యేష్ట శుద్ద ఏకాద‌శి నుండి పౌర్ణ‌మి వ‌ర‌కు టీటీడీ తెప్పోత్స‌వాలు నిర్వహిస్తూ ఉఁటుంది. అందుకు ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి కూడా. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి దయ, కటాక్షం కలుగుతుంది. సంసార బాధలు తొలిగి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పద్మావతి అమ్మవారు బంగారు పుష్ప నుంచి పద్మసరస్సులో ఆవిర్భవించి భక్త కోటికి తల్లిగా మారింది. నిత్య పూజలతో అలసిన సొమ్మవారు తెప్పపై విహరిస్తూ అన్ని దిక్కులకు నేను ఉన్నానని సందేశమిస్తుంది

ఏటా జగజ్జనని రాజోపచారాలు చేయాలని ఆగమ శాస్త్రం చెబుతోంది. అయితే అలా సేవ చేస్తే అమ్మవారు వరాల ఇవ్వదా అంటే… అలా ఏమీ ఉండదు. మనం దేవుడికి దాసులం. ఆ భగవంతుడి సేవ కోస ఏదో ఒకటి చేయకపోతే ఉండలేని భక్తి స్థితి. అందుకే ఇలాంటి ఉపచారాలు చేస్తు ఉంటాం. ఆగమ శాస్త్రం అనుసరించి ప్రతీ రోజలు పూజలు ఎలా చేస్తూ ఉంటామో ఏడాదికోసారి ఉత్సవాలు నిర్వహించి అమ్మవారి దయకి పాత్రులవుతాం. ఐదు రోజుల తెప్పోత్సవాల సందర్భంగా అలివేలు మంగాపురం అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News