Big Stories

BJP : 2వేల నోటుపై కర్నాటక ఎఫెక్ట్!.. వామ్మో, ఇంత స్కెచ్ ఉందా!?

MODI 2000 note ban

BJP News Latest(Morning news today telugu) : వారం రోజులుగా ఒకటే టాక్. దేశమంతా అదే టాపిక్. కర్నాటకలో బీజేపీ ఘోర పరాజయం. కాంగ్రెస్ ఘన విజయం. దక్షిణాదిన ఉనికి లేకుండా పోయింది. మోదీ సభలు, రోడ్ షోలకు ఫలితం రాకుండా పోయింది. జై భజరంగ్ బలి నినాదమూ వర్కవుట్ అవలేదు. బీజేపీ ఎత్తులన్నీ చిత్తయ్యాయి. కర్నాటకలో ఓటమితో ఇక బీజేపీ పని అయిపోయిందంటూ విస్తృత చర్చ, ప్రచారం జరుగుతోంది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కమలదళానికి బిగ్ మైనస్‌గా మారింది. చేరికలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అర్జెంటుగా ఈ టాపిక్‌ను డైవర్ట్ చేయకపోతే.. పార్టీకి బిగ్ డ్యామేజ్ జరగక మానదనేది కాషాయ పార్టీ భావించినట్టుంది.

- Advertisement -

ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలూ వస్తాయి. ఈ సమయంలో కర్నాటకలో బీజేపీ ఓటమి.. ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందులోనూ ఎన్నికలు జరగనున్న.. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాంలో బీజేపీ వ్యతిరేక గాలి వీస్తోంది. కర్నాటక దెబ్బతో.. కమలం మరింత చితికిపోనుంది. ఇంకా ఎంత చర్చ జరిగితే.. అంత రచ్చ.. అంత వ్యతిరేకత. అందుకే, వెంటనే ప్రజల దృష్టిని, మీడియా అటెన్షన్‌ను మార్చేయడానికే ఈ 2వేల నోటు రద్దు ప్రకటించారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది.

- Advertisement -

గతంలో పాత నోట్ల రద్దు/ డీమానిటైజేషన్ చేసినప్పుడు ఇలానే జరిగింది. కొన్ని నెలల పాటు అదే హాట్ టాపిక్‌గా మారింది. జనాలు.. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో పడిగాపులు పడ్డారు. నల్ల ధనమంతా బయటకు వస్తుందని, దొంగనోట్ల తయారీ ఆగిపోతుందని, నిధుల కొరతతో ఉగ్రవాదం తగ్గిపోతుందని, పాకిస్తాన్ పరేషాన్ అవుతుందని, డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరుగుతాయని.. ఇలా టీవీల్లో అద్భుతాలను ఆవిష్కృతమయ్యాయి. మోదీకి మంచి ఇమేజ్ వచ్చింది. సూపర్ డూపర్ డెసిషన్ అంటూ అంతా ప్రధానిని కీర్తించారు. అప్పుడా స్ట్రాటజీ బాగా వర్కవుట్ అవడంతో.. ఈసారి కూడా అదే వ్యూహంతో 2వేల నోటు రద్దు చేశారా? అనే చర్చ జరుగుతోంది.

అయితే, అప్పటకీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా ఉందని.. ఈసారి ఈ నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. అప్పుడంటే అందరి దగ్గరా 100, 1000 నోట్లు ఉన్నాయి కాబట్టి.. పెద్ద నోట్ల రద్దుతో జనమంతా పానిక్ అయ్యారు. నెలల తరబడి ఆ టాపిక్ నడిచింది. కానీ, ఇప్పుడలా కాదు. ఏ ఒక్కరి దగ్గరా 2వేల నోటు లేదు. రద్దు చేస్తే టీవీ ఛానెల్స్ హడావుడి చేస్తున్నాయే కానీ.. ప్రజలెవరూ హైరానా పడట్లే. అప్పుడంటే నోట్ల రద్దుతో అదీఇదీ జరుగుతుందని అన్నారు కానీ.. ఈసారి 2వేల నోటు ఎందుకు రద్దు చేశారో.. దాని వల్ల ఏం ఉపయోగమో.. ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. తాజా నిర్ణయం మోదీకి మరింత మైనస్ అయ్యే ఛాన్సెసే ఎక్కువంటున్నారు. పాజిటివో, నెగటివో.. కర్నాటక టాపిక్ నుంచి నోటు రద్దు వైపు ఇష్యూ డైవర్ట్ అయితే అదే చాలనుకుంటోందా కేంద్రంలోని బీజేపీ?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News