BigTV English

Unlucky Zodiac Signs: గురు, శని సంచారం.. 2025లో ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు !

Unlucky Zodiac Signs: గురు, శని సంచారం.. 2025లో ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు !

Unlucky Zodiac Signs: 2025 సంవత్సరంపై ప్రతి ఒక్కరు అంచనాలతో ఉంటారు. గురు, శనిల సంచారం రాబోయే సంవత్సరం కొన్ని రాశులకు విపరీతమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. 2025 సంవత్సరంలో ఏ రాశుల వారికి ఆర్థిక నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. దీని కారణంగా ధన ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఆర్థిక ఖర్చులు వెంటనే వస్తాయి. మే 2025 నుంచి మిథున రాశికి అధిపతి అయిన బృహస్పతి ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూల ప్రభావం ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం మానుకోవడం మంచిది. లేకపోతే డబ్బు కోల్పోవచ్చు. అయితే రాహువు, కేతువుల కారణంగా మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు ఆర్థిక జీవితంలో సాధారణ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఒక దాని తర్వాత ఒకటి ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు కొరత కూడా పెరుగుతుంది. మే 2025 తర్వాత సింహ రాశి వారికి కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో వారు కొంత డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. అనవసర ఖర్చుల వల్ల మనస్సు చికాకుగా ఉంటుంది.
కన్యా రాశి:


2025 తర్వాత కన్యా రాశి వారు డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం. బృహస్పతి కన్యా రాశి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు ఎదుర్కుంటారు. మార్చి 2025 నుంచి వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి:
ఆర్థిక రంగంలో ధనస్సు రాశి వారికి 2025 సంవత్సరం అనుకూలంగా ఉండదు. ఖర్చులు బాగా పెరుగుతాయి. బృహస్పతి సంచారం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏప్రిల్ 2025 నాటికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే మంచిది.

Also Read: ఈ 4 రాశుల వారు అకస్మాత్తుగా ధనవంతులు కాబోతున్నారు..


కుంభ రాశి:
2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థిక జీవితం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో మీరు లాభాలను పొందుతారు. ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి. అధిక ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది. ఖర్చుల కారణంగా ఆందోళన పెరుగుతుంది. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి.

Tags

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

Big Stories

×