OnePlus Nord CE5 5G: వన్‌ప్లస్ అంటేనే టెక్ లవర్స్‌కి ఒక క్రేజ్. ప్రీమియం ఫీచర్స్‌తో, అందుబాటులో ఉండే ధరలో స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడంలో ఈ బ్రాండ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు మరోసారి మార్కెట్‌లో దుమ్మురేపేందుకు అడుగుపెట్టింది. కొత్తగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ5 5జి ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇది మధ్యస్థ బడ్జెట్ సెగ్మెంట్‌లో వస్తూనే, ఫీచర్ల పరంగా మాత్రం ఫ్లాగ్‌షిప్ స్థాయిలో దూసుకెళ్తుంది. ఇప్పుడు దీని పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్స్, ధర, ఫీచర్లు అన్ని వివరంగా చూద్దాం.
డిజైన్ – బిల్డ్ క్వాలిటీ
ముందుగా డిజైన్ విషయానికి వస్తే, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌కి ఎప్పటిలాగే ఒక స్టైలిష్ ఫీల్ ఉంటుంది. సిఈ5 5సిలో కూడా అదే ఫీల్ కొనసాగింది. స్లిమ్ బాడీ, గ్లాసీ ఫినిష్, తేలికైన వెయిట్. ఫోన్‌ని చేతిలో పట్టుకున్న వెంటనే ప్రీమియం అనిపిస్తుంది. వెనుక వైపు మూడు కెమెరాలు ట్రిపుల్ మాడ్యూల్‌లో కనిపిస్తాయి. ఫ్రేమ్‌పై మెటాలిక్ లుక్ ఇచ్చి క్లాస్‌ని పెంచేశారు. ఫోన్‌కి రెండు అద్భుతమైన కలర్స్ వచ్చాయి — “స్కై బ్లూ” మరియు “మిడ్‌నైట్ షేడో.”
డిస్‌ప్లే వివరాలు
డిస్‌ప్లే విషయంలో వన్‌ప్లస్ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. ఈ సిఈ5లో 6.7 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. వీడియోలు, గేమ్స్ ఆడేటప్పుడు అద్భుతమైన కలర్స్, కాంట్రాస్ట్ కనిపిస్తాయి. హెచ్‌డిఆర్10 ప్లస్ సపోర్ట్ కూడా ఇచ్చారు కాబట్టి సినిమాలు చూస్తే థియేటర్ ఫీలింగ్ వస్తుంది.
ప్రాసెసర్ – పనితీరు
ఇప్పుడు ప్రధాన విషయం ఫోన్ పనితీరు.. వన్‌ప్లస్ నార్డ్ సిఈ5 5జిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్‌సెట్ వేశారు. ఇది పవర్‌ఫుల్‌గా ఉండి, గేమింగ్‌కి కూడా సరిపోతుంది. 5జి కనెక్టివిటీతో పాటు వేగవంతమైన నెట్‌వర్క్ సపోర్ట్ అందిస్తుంది. ఫోన్ రెండు వెర్షన్లలో వస్తుంది. 8జిబి ర్యామ్ ప్లస్ 128జిబి స్టోరేజ్, అలాగే 12జిబి ర్యామ్ ప్లస్ 56జిబి స్టోరేజ్. ర్యామ్ ఎక్స్‌పాంషన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మల్టీటాస్కింగ్ సులభం.
Also Read: Honda Gold Wing Bike: ఏంటీ.. ఈ బైక్ ధర రూ.43 లక్షలా? దీని ఫీచర్స్ తెలిస్తే ఏమైపోతారో?
కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ ఫోన్ ఒక గిఫ్ట్‌లాంటిది. ఇందులో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా ఉంది. ఇది అద్భుతమైన క్లారిటీతో ఫోటోలు ఇస్తుంది. అదనంగా 8ఎంపి అల్ట్రా వైడ్ మరియు 2ఎంపి మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీ లవర్స్‌కి 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. నైట్ మోడ్‌లో కూడా ఫోటోలు చాలా నేచురల్‌గా వస్తాయి. వీడియో షూట్ చేస్తే 4K 60fps వరకు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ – ఛార్జింగ్
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, ఇది 5000mAh కెపాసిటీతో వస్తుంది. దీని ముఖ్య ఆకర్షణ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్. అంటే కేవలం 30 నిమిషాల్లోనే 60శాతం పైగా ఛార్జ్ అవుతుంది. వన్‌ప్లస్‌కి ఇది ప్రత్యేకతే. ఎక్కువ వాడకానికి, గేమింగ్‌కి, రోజంతా స్క్రీన్ టైమ్‌కి కూడా సరిపోతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఆక్సిజన్ ఓఎస్ 14 (ఆండ్రాయిడ్14 బేస్) తో వస్తుంది. సింపుల్ ఇంటర్‌ఫేస్, యాడ్స్ లేని క్లీన్గా ఉంటుంది. వన్‌ప్లస్ ప్రత్యేకంగా రెండు సంవత్సరాల మేజర్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ ఇవ్వనుంది.
ధర వివరాలు
ఇప్పుడు అందరికి ఆసక్తి కలిగించే విషయం ధర ఎంతుంటుంది అని. ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ సిఈ5 5సి యొక్క ధర రూ.22,999 నుండి ప్రారంభం అవుతుంది. టాప్ వెర్షన్ 12సిబి ప్లస్ 256జిబి ధర రూ.26,999. ఈ ధరలో ఇంత ఫీచర్స్ ఇవ్వడం వన్‌ప్లస్ మాత్రమే చేయగలదు. ఫోన్ ఆన్‌లైన్‌గా అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌ల్లో అందుబాటులో ఉంది. వీలైనంత త్వరగా చెక్ చేసి ఆఫర్లలో ఇంకా తక్కువ ధరతో మీ సొంతం చేసుకోండి.