BigTV English

HBD Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో… ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?

HBD Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో… ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?
Advertisement

HBD Sai Dharam Tej: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej). మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. తన ప్రతిభను నిరూపించుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుస విజయాలు అందుకొని భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. జీవితంలో అతి పెద్ద అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారు. అదే బైక్ యాక్సిడెంట్. మరణం అంచుల వరకు వెళ్లిన ఈయన పునర్జన్మను సాధించారనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈరోజు (అక్టోబర్ 15) ఈయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన కెరియర్ , నికర ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


సాయి ధరమ్ తేజ్ కెరియర్..

విషయంలోకి వెళ్తే.. ఇండస్ట్రీలోకి రేయ్ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో ‘పిల్ల నువ్వు లేని జీవితం’ తో మంచి హిట్ అందుకున్నారు సాయి ధరంతేజ్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సినిమాలతో వరుస సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన విన్నర్, తిక్క, నక్షత్రం సినిమాలు ఘోర పరాజయాన్ని పొందడంతో.. ఈయన కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ తరువాత తేజ్ ఐ లవ్ యూ, ఇంటెలిజెంట్, జవాన్ వంటి చిత్రాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. యాక్సిడెంట్ తర్వాత చేసిన బ్రో సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన. విరూపాక్షతో మంచి విజయం అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది.

సాయి ధరంతేజ్ ఆస్తులు..

ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ఈయన ఆస్తులు వివరాల విషయానికొస్తే.. సాయి ధరంతేజ్ నికర ఆస్తుల విలువ సుమారుగా రూ.150 నుండి రూ. 180 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ప్రతి సినిమాకి సుమారుగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.


ALSO READ:Bigg Boss 9: రమ్య ఫుడ్ లిస్ట్.. దెబ్బకు పడిపోయిన రీతూ.. అందుకే సుమన్ ను ఎంచుకున్నావా తల్లీ!

కార్ కలెక్షన్స్..

అలాగే ఆయన దగ్గర ఉన్న వెహికల్ కలెక్షన్ విషయానికి వస్తే.. మొదట ఈయనకు వాహనాలు బైక్స్ అంటే చాలా ఇష్టం అందులో భాగంగానే వోల్వో ఎక్స్ సీ 90, టయోటా ఫార్చునర్, బీఎండబ్ల్యూ ఎం 3 వంటి వాహనాలు ఆయన వద్ద ఉన్నాయి.ఇకపోతే ఆక్సిడెంట్ తర్వాత బైక్స్ కి దూరంగా ఉంటున్న ఈయన.. తన దగ్గర ఉన్న లగ్జరీ బైక్ లను కూడా అమ్మేసినట్లు సమాచారం.

సాయి ధరంతేజ్ సినిమాలు..

ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అసుర ఆగమన అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. యువ దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తూ ఉండగా.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అంతేకాదు సాయి ధరంతేజ్ కెరియర్ లోనే రికార్డ్ స్థాయిలో బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయిస్తున్నట్లు సమాచారం..

Related News

Avika Gor: పెళ్లి పై ట్రోల్స్..సంతోషంగా ఉందన్న అవికా గోర్.. ఏమైందంటే?

Ram Pothineni: మెగా ఫోన్ పట్టనున్న యంగ్ హీరో… స్క్రిప్ట్ కూడా సిద్ధం!

Bollywood Movies : హిందీ సినిమాలపై నిషేధం… అసెంబ్లీలో బిల్లు.. సీఎం సంచలన నిర్ణయం

Pankaj dheer: మహాభారత కర్ణుడు పంకజ్ ధీర్ మృతి..68 ఏళ్ల వయసులో

Niharika: లవ్ యూ బావ.. క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. ఫోటో వైరల్!

Tollywood: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ సింగర్ బాల సరస్వతి కన్నుమూత!

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి

Big Stories

×