Mlc Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసిందని, ఆ పార్టీ అధినేత పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం తాను కాదని తేల్చేశారు. ఈ విషయంలో ఆయన్ని అగౌరపరచ లేదన్నారు. ఆయన ఉద్యమ నాయకుడని గుర్తు చేశారు. ఇవాళ ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు.
కేసీఆర్ ఫోటో గురించి కామెంట్స్
ఆ పార్టీ తాను ప్రాథమిక సభ్యురాలిగా లేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని జాగృతి సంస్థను పటిష్టం చేయడమే ధ్యేయమన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఫోటోని పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లలేనని తేల్చి చెప్పారు. ఆది నైతికంగా తనకు మంచిది కాదని క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ అనే మహావృక్షం కింద అనేకమంది దుర్మార్గులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను అనేకమార్లు చెప్పానని గుర్తు చేశారు. ఎట్టకేలకు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దాదాపు నాలుగు నెలల యాత్రను చేపడుతున్నారు. ‘జాగృతి జనం బాట’ పేరుతో యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కవిత జనం బాట.. నాలుగు నెలలు
అక్టోబర్ 25 నుంచి కవిత యాత్ర మొదలుకానుంది. ఫిబ్రవరి 13 వరకు జరగనుంది. తెలంగాణ జాగృతి పుట్టినప్పుడు నుండి సపరేట్‌గా పని చేసిందన్నారు. కేసిఆర్ నుండి ఎప్పుడూ సలహాలు తీసుకోలేదన్నారు. జాగృతిలో చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడారు. మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ సామాజిక తెలంగాణను సాధించలేదన్నారు.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి
తాను సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ తనను తప్పు పట్టిందని, చివరకు సస్పెండ్ చేసిందన్నారు. సామాజిక తెలంగాణ అనేది విధానపరమైన అంశమని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు.. వాళ్ళను మించిన గురువులు లేరన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని ప్రజల సమస్యలు గురించి మాట్లాడితే ఉపయోగం ఉండదన్నారు.
అందుకే కిందిస్థాయిలో పని చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటానని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా గ్రామాల్లోని ప్రతి రైతు, మహిళా, యువతతో మాట్లాడతానని వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన ఆమె, ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడు: కవిత
కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం
కేసీఆర్‌ని అగౌరవపరచడం లేదు
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఫోటోని వాడుకోవడం నైతికంగా నాకు సరికాదు
– కల్వకుంట్ల కవిత pic.twitter.com/yQvlE9MAGR
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2025
కల్వకుంట్ల కవిత యాత్ర పోస్టర్ విడుదల
తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్
ప్రొ.జయశంకర్ ఫోటోతో కవిత యాత్ర పోస్టర్
'జాగృతి జనం బాట' పేరుతో పోస్టర్
జిల్లాల బాటకు సిద్దమైన కవిత pic.twitter.com/A0QvXH2yfG
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2025