BigTV English

Vadde Naveen: జాబిలమ్మ నీకు అంత కోపమా సాంగ్ హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..?

Vadde Naveen: జాబిలమ్మ నీకు అంత కోపమా సాంగ్ హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..?

Vadde Naveen: జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూలమీద జాలి చూపుమా.. ఈ పాట గుర్తుందా.. ? గుర్తులేకుండా ఎందుకు ఉంటుందిలెండి. ఇప్పటికీ భార్య కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ అలిగితే.. ఏ మగాడు అయినా ఈ పాటను అందుకోవడమే కదా చేసేది. అంతలా ఈ పాట అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. మరి అలాంటి పాటలో నటించిన హీరో గుర్తున్నాడా.. ? అతని పేరు వడ్డే నవీన్.


నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. ఈ సినిమా మంచి ఫలితాన్నే అందించింది. దీని తరువాత కొన్ని సినిమాలు చేసినా నవీన్ కు బ్రేక్ ఇచ్చింది మాత్రం పెళ్లి సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీని తరువాత నవీన్ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు.

మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దాదాపు నవీన్.. 28 చిత్రాల్లో నటించాడు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు సంపాదించిన వడ్డే నవీన్.. నిర్మాతగా కూడా మారి మూడు నాలుగు సినిమాలు తెరకెక్కించాడు.


ఇక విజయం ఉంటే పరాజయం కూడా ఉంటుంది. మంచి హీరోగా మెప్పించిన నవీన్.. స్లోగా డౌన్ అవుతూ వచ్చాడు. ఆ సమయంలోనే నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్లాడాడు. నవీన్ ఎన్టీఆర్ అల్లుడు అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఇక విబేధాల కారణంగా ఈ జంట కొన్నేళ్ళకే విడిపోయారు. ఆ తరువాత నవీన్ కు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమై వ్యాపారం చేస్తూ సెటిల్ అయ్యాడు. రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక నవీన్ కు ఇద్దరు పిల్లలు. ఇటీవలే ఆయన కొడుక్కి నిర్వహించిన పంచెకట్టు కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రెటీలందరూ హాజరయ్యారు. ఈ వేడుకలోనే నవీన్- చిరంజీవి కలిసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

2016లో రామ్‌గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఎటాక్ సినిమాలో నవీన్ చివరిగా కనిపించాడు. అప్పుడు వెళ్లిపోవడం.. ఇప్పటివరకు నవీన్ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక ఈ మధ్యనే నవీన్.. ఒక మీడియాకు ఎదురయ్యాడు. నవీన్ ఏమైపోయాడు అని వస్తున్న వార్తలకు ఆయన సమాధానమిచ్చాడు. సినిమాకు కొంత గ్యాప్ మాత్రమే తీసుకున్నాను అని, మంచి ప్రాజెక్ట్ ఉంటే కచ్చితంగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం గొలుసు అనే చిత్రంతో వడ్డే నవీన్ రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో వడ్డే నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×