Poppy Seeds: సాధారణంగా స్వీట్లు , వంటల తయారీలో ఉపయోగించే గసగసాలు కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు.. పోషకాలకు శక్తివంతమైన వనరు. ఈ చిన్న విత్తనాలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఔషధ గుణాలు వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి.
సాంప్రదాయ వైద్యంలో మంచి నిద్రను ప్రోత్సహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగు పరచడానికి గసగసాలను ఉపయోగిస్తారు. వీటిలోని ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం వాటిని సూపర్‌ఫుడ్‌గా చేస్తాయి. ఇంతకీ గసగసాలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గసగసాల ప్రయోజనాలు:
ఒత్తిడి ఉపశమనం:
గసగసాలు సహజంగానే మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, అంతే కాకుండా నిద్రను ప్రేరేపించడానికి సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మీరు నిద్ర లేమి లేదా ఒత్తిడితో బాధపడుతుంటే.. పడుకునే ముందు గసగసాలు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. అంతే కాకుండా ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.
ఎముక సమస్యలు:
గసగసాలు కాల్షియం, భాస్వరం యొక్క అద్భుతమైన మూలం. ఈ రెండూ ఎముకల ఆరోగ్యం, బలానికి చాలా అవసరం. గసగసాలను ప్రతిరోజూ.. ముఖ్యంగా పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అంతే కాకుండా ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా ఉండటంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: అతిగా నిద్ర పోతున్నారా ? కారణాలు తెసుకోకపోతే కష్టమే !
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:
గసగసాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సజావుగా నిర్వహించడానికి సహాయ పడుతుంది. అవి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో అంతే కాకుండా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవి కడుపును శుభ్రపరచడంలో, ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయ పడతాయి.
హృదయ ఆరోగ్యం:
గసగసాలలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనవి. అవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.