Triple Transit: మూడు గ్రహాల అనుకూల సంచారం కారణంగా ఆ ఆరు రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుంది. ఇప్పటి నుంచి వచ్చే నవంబర్ వరకు ఆ ఆరు రాశుల జాతకులకు పట్టిందల్లా బంగారమే అన్నంతగా కాలం మారనుంది. ఇంతకీ ఆ ఆరు రాశుల జాతకులు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహ గమనాల ఆధారంగా మనుషుల జీవితాలను లెక్కిస్తుంటారు. గ్రహాల అనుకూల మార్పుల వల్ల అంత వరకు కష్టాలు పడ్డ వారి జీవితాలు మారిపోయి హ్యపీగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం బుధ, గురు, శుక్ర గ్రహాల అనుకూల సంచారం వల్ల నవంబర్ వరకు అదృష్టయోగం పట్టబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: మూడు గ్రహాల అనుకూల సంచారం వల్ల మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. అసలు ఊహించని శాఖలలో కీలకమైన పోస్టులకు ప్రమోషన్లు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని తీరిపోతాయి. ఇక ఈ రాశి వారు మార్కెట్ లో పెట్టే పెట్టుబడులు లాభాల వర్షం కురిపిస్తాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కే శుభకాలం మేష రాశి వారికి వచ్చింది.
వృషభ రాశి: ఈ రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో జన్మలగ్నంల వల్ల యోగ బలం కలిసి రానుంది. దీంతో ఈ రాశి వారికి ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. ఆస్థి సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు జీతాలు రెట్టింపు అవుతాయి. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి నవంబర్ వరకు గురు బలం పుష్కలంగా ఉండనుంది. దీంతో ఇంట్లో ఎన్నో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే బుధుడి అనుకూలతతో కొత్త లావాదేవీలు లాభిస్తాయి. పాత సమస్యలు తీరిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు ఇస్తాయి.
కన్యా రాశి: ఈ రాశి వారికి దశమంలో గురువు, లాభస్థానంలో బుధుడు ఉండటంతో ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచి ఆదాయ మార్గాలు కలిసి రానున్నాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి.
మకర రాశి: మూడు గ్రహాల అనుకూల సంచారంతో ఈ రాశి వారికి యోగ కాలం రానుంది. ఈ రాశి ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ, కళా రంగాలలో ఉన్న వారికి పేరు, ప్రఖ్యాతులు విపరీతంగా వస్తాయి. వ్యాపారంలో అంచనాలను మించిన లాభాలు వస్తాయి. అన్న విషయాలలో పెద్దల సహాయం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
మీన రాశి: ఈ రాశి వారికి కూడా నవంబర్ వరకు అద్బుతమైన యోగకాలం ఉండబోతుంది. ప్రతి ప్రయత్నం విజయవంతంగా సాగుతుంది. పెళ్లి, ఉద్యోగ మార్పులు చోటు చేసుకుంటాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడులు లాభిస్తయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: దేవుని పూజకు పనికిరాని పువ్వులేవో తెలుసా..? అవి వాడితే పుణ్యం కన్నా పాపం చుట్టుకుంటుందట