BigTV English

Puja Tips: దేవుని పూజకు పనికిరాని పువ్వులేవో తెలుసా..? అవి వాడితే పుణ్యం కన్నా పాపం చుట్టుకుంటుందట

Puja Tips: దేవుని పూజకు పనికిరాని పువ్వులేవో తెలుసా..? అవి వాడితే పుణ్యం కన్నా పాపం చుట్టుకుంటుందట

Puja Tips: దేవుని పూజలకు పనికిరాని పుష్పాలు ఏవో మీకు తెలుసా..? ఏ పూలు వాడితే దేవుడు త్వరగా కరుణిస్తాడో తెలుసా..? కొన్ని రకాల పువ్వులు పూజకు వాడటం వల్ల వచ్చే పుణ్యం కంటే పాపం పాలు ఎక్కువ ఉంటుందట. అసలు దేవుని పూజకు వాడకూడని పుష్పాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.


సాధారణంగా దేవుని పూజకు ఏ పుష్పాలైన వాడొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ అలా కాదు కొన్ని రకాల పువ్వులు వాడటం వల్ల జరిగే మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇక ఏఏ పూలను ఎలా వాడాలో ఎలా వాడకూడదో సనాతన ధర్మంలో స్పష్టంగా ఉందంటున్నారు పౌరోహితులు. అయితే ముఖ్యంగా బంతి పూలు దేవుని పూజలకు అసలు ఉపయోగించకూడదట. బంతిపూలు పూజలో వాడటం వల్ల వచ్చే శుభఫలితాలు కాస్త  నెగటివ్‌గా మారిపోతాయని అంటున్నారు. అయితే బంతిపూలను శుభకార్యాలలో గుమ్మానికి మాత్రమే కట్టాలని సూచిస్తున్నారు. సైన్స్‌ పరంగా చూసుకుంటే.. బంతిపూలకు క్రిమికీటకాలను ఆకర్షించే గుణం ఉంటుంది. కాబట్టి బంతిపూలు గుమ్మానికి కడితే బయటి నుంచి వచ్చే క్రిమికీటకాలను ఆకర్షించి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి.

మొగలిపువ్వులు: ఈ పువ్వులు సున్నితంగా ఉండవు.. అతి ఎక్కువ వాసన వెదజల్లడంతో వెగటుగా ఉంటాయి. అలాగే ఆహ్లాదాన్ని, అనుకూల శక్తిని కూడా ఇవ్వదు. ఈ పూలు ఉన్న చోట పాములు తిరిగుతూ ఉంటాయి. అందుకే మొగలిపువ్వులు పూజకు ఉపయోగించరాదు అని చెప్తున్నారు పండితులు. ఇక పురిటింట్లో వాళ్లు, మైల ఉన్న వారు, బహిష్టులైన వారు తాకిన పువ్వులను పూజకు వాడరాదు. అలాగే కింద పడిన పూలు, ఎవరైనా వాసన చూసిన పూలు లేదా కడినపూలు, ఎడమచేతితో కోసిన పూలు అంతకు ముందు పూజకు ఉపయోగించిన పూలు పూజకు ఉపయోగించకూడదు. పూలు దేవుడికి మధ్యవేలు, ఉంగరపు వేలు బొటన వేలుతో కలిపి సమర్పించాలి. ఇక చెట్టుకు కింది ముఖంగా ఉన్న పూలు కూడా పూజకు పనికిరావని చెప్తున్నారు. అయితే బిల్వదళాలు, తులసీదళాలకు ఈ నియమాలు వర్తించవు. ఇక దేవుడికి సమర్పించిన పూలు మరుసటి రోజు మార్చేయాలి.


దేవునికి కాగితం పూలు వేస్తే నిత్య దరిద్రులుగా మారిపోతారు. ఇక ప్లాస్టిక్‌ పూలమాలను వేస్తే  చర్మవాధులు వస్తాయట. ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు పువ్వు తీసుకుని పూజ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. పాడయిన పూలతో పూజ చేస్తే దేహంలో అయిన గాయాలు నయం కావు. పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే.. మీకు ఏర్పడిన గాయాలలో పురుగులు పడతాయట. కానీ సువాసన నిండిన పూలతో పూజ చేస్తే మీ జీవితం కూడా సుఖమయం అవుతుంది. పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దరిద్రాలు పోయి శ్రీమంతులు అవుతారు. మల్లెపువ్వుతో పూజిస్తే సకల రోగాలు నయమవుతాయి. గన్నేరు పువ్వులతో పూజిస్తే రైటర్స్‌కు క్రియేటివిటీ పెరుగుతుంది.

కానీ ఈ పువ్వులతో పూజ చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంద పుష్ఫంతో పూజ చేస్తే ముఖంలో తేజస్సు వస్తుంది. ఇక అశోక పువ్వులతో పూజ చేస్తే జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి. నల్ల కలువ పువ్వులతో శనీశ్వరుడికి  పూజ చేస్తే అన్ని రకాల శనిబాధలు తొలగిపోతాయి. పాదరి పుష్ఫంతో పూజ చేస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. పున్నాగపుష్పంతో లక్ష్మీ నారాయణుడికి, కానీ గోపాలకృష్ణుడికి కానీ పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది. వకుళపుష్పంతో శ్రీ భూవరాహ స్వామికి లేదా లక్ష్మీ నారాయణుడికి పూజ చేస్తే భూ యోగం, సొంతింటి యోగం కలుగుతుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×