BigTV English

Twin Bananas : జంట అరటిపళ్లు దేవుడికి సమర్పించవచ్చా…?

Twin Bananas : జంట అరటిపళ్లు దేవుడికి సమర్పించవచ్చా…?

Twin Bananas : జంట అరటిపండ్లను దేవుడికి సమర్పించకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు… కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు…. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి.అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. అరటి చెట్టు అంటే సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతను ఆయన ఇచ్చారు.


అంత పవిత్రమైన పండులో మనం దోషాలను చూడాల్సిన పనిలేదు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చని పండితులు చెబతున్నారు.. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా.. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడం మంచిది.

అసలు జంట అరటిపళ్లు దేవుడి అర్పించడం తప్పనే విషయం ఎక్కడా చెప్పలేదు. అరటి చెట్టు వినాయకుడికి ప్రీతిపాత్రమైనది. దక్షిణాదిన ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా అరిటాకులో భోజనం పెడతారు. హిందూ ఆచారం ప్రకారం దేవాలయం, పెళ్లి వంటి శుభాకార్యాలయాల్లో అరటి ఆకుల్లోనే భోజనం పెడుతుంటారు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×