BigTV English
Advertisement

Health tips : మొల‌క‌లు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?

Health tips : మొల‌క‌లు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?

Health tips : చాలా మంది మొల‌క‌ల‌ను తినడానికి ఇష్టపడరు. ఈ మొల‌క‌లు చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. బ‌రువు తగ్గాలనుకుంటే ఇవి మంచి ఆహారం,. అంతేకాకుండా మొలకలు తినడం వల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండవు. కాసేపు ఇంట్లోనే శ్రమిస్తే మొలకలను సులభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ల్లీలు, పెస‌లు, శ‌న‌గ‌లులాంటి గింజ‌ల‌తో మొల‌క‌లు ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నింటిని కలిపి కూడా మొల‌క‌లు చేయ‌వ‌చ్చు. ముందుగా ఈ గింజ‌లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటి నుంచి తీసి శుభ్ర‌మైన బట్టలో కట్టి ముడివేయాలి. ఆ తర్వాత 24 నుంచి 48 గంట‌ల పాటు ఉంచాలి. అంతే మొలకలు తయారవుతాయి. పెస‌లు అయితే తొందరగా మొల‌క‌లుగా అవుతాయి. అయితే బట్టలో కట్టకపోతే మాత్రం ఒక గిన్నె తీసుకుని అందులో గింజలు వేసి మూతపెట్టాలి. ఇలా చేసినా మొలకలు తయారవుతాయి. మొల‌క‌ల వ‌ల్ల అనేక లాభాలున్నాయి. మ‌న శ‌రీరానికి కావల్సిన అనేక పోష‌కాలు అందుతాయి. చాలా రకాల గింజలతో మొల‌క‌లు చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ప్రోటీన్లు, మెగ్నీషియం, ఫోలేట్‌, ఫాస్ఫ‌ర‌స్‌, విటమిన్‌ సి, కెతో పాటు మాంగ‌నీస్‌ కూడా శరీరానికి లభిస్తుంది. ఈ మొల‌క‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహంతో బాధపడేవారు మొలకలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. షుటర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మొలకల్లో ఉండే ఫైబర్‌ వల్ల ఆక‌లి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. మొల‌క‌ల్లో ఉండే పోష‌కాలు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. దీంతో మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అయితే మొల‌క‌లను తీసుకునేందుకు కూడా ఓ పద్ధతి ఉంది. ఇందులో ఉండే బాక్టీరియా వల్ల కొంద‌రిలో ఇన్‌ఫెక్ష‌న్లు వస్తాయి. అందుకే వీటిని నంపై కొద్దిగా వేయించి తీసుకోవ‌చ్చు. రుచి కోసం కొద్దిగా మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం క‌లుపుకోవచ్చు. దీంతో అద‌న‌పు పోష‌కాలు కూడా మనకు లభిస్తాయి. మొల‌క‌ల‌తో కూర కూడా చేసుకుని తినొచ్చు. పండ్ల‌తో క‌లిపి స‌లాడ్‌ల రూపంలో తీసుకోవచ్చు. ఉద‌యం టిఫిన్‌లో కొద్ది మోతాదులో మొలకలు తీసుకోవ‌చ్చు. లేదా వ్యాయామం చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు.


Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×