BigTV English

Ugadi Dishes : ఉగాది స్పెషల్ వంటకాల వెనుక మర్మమిదే.

Ugadi Dishes : ఉగాది స్పెషల్ వంటకాల వెనుక మర్మమిదే.
Ugadi dishes

Ugadi dishes : ఉగాది తెలుగువారి ప్ర‌త్యేక పండ‌గ‌.. వ‌సంత రుతువులో ప్రారంభ‌మ‌య్యే తెలుగు కొత్త సంవ‌త్స‌రానికి ప్రారంభం చైత్ర‌మాసం. ఆ నెల మొద‌టిరోజే ఈ ప్ర‌త్యేక‌మైన ఉగాది .మన తెలుగు వారి పండగలు అనగానే గుర్తొచ్చేవి రకరకాల వంటకాలు. ముఖ్యంగా తెలుగు నూతన సంవత్సరం అనగానే ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు, పులిహోర, దద్ద్యోజనం ఇంకా చాలా గుర్తుకొస్తాయి. ఉగాది రోజు స్పెషల్ చేసుకునే వంటకాల్లో పచ్చడి, పూర్ణం, బూరెలు, బొబ్బట్లు, పులిహోర ,చక్కెర పొంగలి, రవ్వ కేసరి ,పాల తాళికలు ,మేడు వడ ఈ పండుగకు పురాన్ పోలీ లేదా పూర్ణం భక్షాలను తయారుచేస్తారు . శాస్త్రప‌రంగానే కాదు.. ఆరోగ్య‌ప‌రంగా కూడా ఈ ఆహారం తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు పోష‌కాహార నిపుణులు.


ఉగాది పచ్చడి
రుచి తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు రుచులతో ఉంటుంది. బెల్లంలోని తీపి జీవితంలోని మంచి అనుభవాలను సూచిస్తుంది. పచ్చి మామిడి పండ్ల నుండి వచ్చే పులుపు జీవితంలోని ఆశ్చర్యకర సంఘటనలకి సూచిగా భావిస్తారు వేప చేదు జీవితంలోని చేదు అనుభవాలను, కష్టాలను సూచిస్తుంది. కారం సమస్యలను, వగరు ఇబ్బందులు, ఎదురు దెబ్బలను సూచిస్తుంది. ఉప్పు భవిష్యత్తు సూచించే భయంకరమైన అంచనాలను ప్రదర్శిస్తుంది.

పులిహార
కార్బొహైడ్రేట్ల‌తో పాటు ఇటు వేరుశ‌న‌గ గింజ‌లు, ప‌ప్పుల్లోని ప్రొటీన్లు కూడా మ‌న‌కు అందుతాయి. మామిడికాయ‌తో దీన్ని చేయ‌డం వ‌ల్ల విట‌మిన్ సి అత్య‌ధిక మోతాదులో అందే వీలుంటుంది.


బొబ్బట్లు
బెల్లం ఎన్నో పోష‌కాల‌ను, ఐర‌న్‌ని అందిస్తే.. ప‌ప్పు మ‌న‌కు కావాల్సిన ప్రొటీన్ల‌ను అందిస్తుంది . గోధుమ పిండిలోని కార్బొహైడ్రేట్లు మ‌న‌కు శ‌క్తిని అందిస్తాయి. నెయ్యిలోని ఫ్యాట్ కూడా క‌ల‌వ‌డంతో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు క‌లిసిన సంపూర్ణ వంట‌కంగా ఇది మ‌న‌కు పోష‌కాల‌ను అందిస్తుంది.

పానకం
బెల్లం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఐర‌న్‌తో పాటు ఎన్నో అత్య‌వ‌స‌ర‌మైన విట‌మిన్లు, మిన‌రల్స్ అందుతాయి. అంతేకాదు.. వేస‌విలో ఇది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది. అతి దాహం నుంచి ర‌క్షిస్తుంది.

బూరెలు
శెన‌గ‌పప్పుతో పాటు మిన‌ప్ప‌ప్పులోని ప్రొటీన్లు కూడా అందుతాయి కాబ‌ట్టి ఈ వంట‌కం నుంచి పోష‌కాల‌ను ఎక్కువ‌గా పొందే వీలుంటుంది.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×