BigTV English

Ugadi: శోభకృత్ నామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి..?

Ugadi: శోభకృత్ నామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి..?

Ugadi:ప్లవనామ సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఏడాది మొదలైపోయింది. తెలుగువారికి ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సంవత్సరాదిగానూ దీన్ని వ్యవహరిస్తారు.శోభకృత్ అంటే శోభను కలిగించేదని అర్థం. శోభకృత్ సంవత్సరము జీవితాలలో వెలుగును నింపేది అని ఉద్యానవనాలన్నీ పూలశోభతో కళకళలాడుతూ ఉండే సంవత్సరము. శ్రీ శోభకృత్ నామ సంవత్సరము. ఉత్తరార్థగోళంలో 21 రోజుల పాటు సూర్యుడి నుండి నిరంతరం కాంతి వస్తుంది కాబట్టి కొత్త ఖగోళ చక్రం ఉగాది రోజున ప్రారంభమవుతుందని చాంద్రమాన క్యాలెండర్ చెబుతోంది. భూమి సూర్యుని పరిభ్రమణం పూర్తి చేసే రోజు ఉగాది.


ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా సూర్యోదయానికి ముందే లేచి ఇంటికి శుభ్రపరుచుకోవాలి. మామిడి తోరణాలతో, పువ్వులతో ఇంటిని ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించాలి. ఉగాది రోజు కచ్చితంగా తలస్నానమాచరించాలి. ఉగాదిరోజు కొత్త బట్టలు ధరించాలని శాస్త్రం చెబుతోంది.. ఉగాది రోజు ఇంటి ఇలవేల్పును లేదా మీ ఇష్టమైన దైవరాధన చేయాలి. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష’ శోక నరాభీష్ట మధుమాస సముదర్భవ|
నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు||


ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది రోజు ఆలయ దర్శనం వంటివి చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగుతుంది. ఉగాది రోజు దైవారాధన పూజలు తరువాత ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి ఇంటిల్లపాది స్వీకరించి బంధుమిత్రులకు పంచాలి. ఉగాది రోజు తల్లిదండ్రులు, గురువులు ఆశీస్సులు పొందాలి. ఉగాది రోజు కచ్చితంగా పంచాంగ శ్రవణం చేయమని మన సనాతన ధర్మం చెబుతోంది. రామాయణ, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలు చదవడం, నూతన పనులు ప్రారంభించడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం లాంటివి పాటించాలి. .

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×