Vastu Tips: హిందూ సాంప్రదాయంలో దేవుళ్ళు, దేవతలను మాత్రమే కాకుండా చెట్లు , మొక్కలను కూడా పూజిస్తారు. ఇది మాత్రమే కాదు.. జంతువులు, పక్షులకు కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఉదయం మీరు టీ తాగుతున్నప్పుడు.. ఒక పిచ్చుక మీ కిటికీ మీద కూర్చుని కిచకిచలాడడం ప్రారంభిస్తే.. మీరు దాన్ని చూసి నవ్వుతావు, కానీ ఈ చిన్న పక్షి తనతో ఏ సందేశాన్ని తెచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా ?
వాస్తు శాస్త్రం గురించి మాట్లాడుకుంటే.. ఇంటికి వచ్చే జంతువులు, జీవులు కేవలం యాదృచ్చికం కాదని, అవి ఏదో ఒక శక్తికి సంకేతాలు అని వాస్తు శాస్త్రం చెబుతుంది. మీ జీవితంలో ఏ జంతువు , పక్షి అదృష్టాన్ని తెస్తాయి ? వేటికి మీరు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జంతువులు, పక్షుల రాక శుభ సంకేతాలను తెస్తుంది ?
పిచ్చుక:
ఇంట్లో గూడు కట్టినప్పుడు.. ఆనందం, శాంతి రెక్కలు విప్పినట్లు అనిపిస్తుంది. ఈ పక్షి ప్రేమ, ఆప్యాయత, శ్రేయస్సుకు కూడా ఇది చిహ్నం. అవి తమ గూడును వదిలి వేరే చోటికి వెళ్లకుండా ఉండటానికి, మీరు వాటి గూడులో ఆహారం, నీటిని కూడా ఉంచండి.
పావురం:
మీ పైకప్పు లేదా ఇంటి సమీపంలో పావురం గూడు చేసుకుంటే.. ఇంట్లో మంచి జరగబోతుందని గుర్తుంచుకోండి. కానీ దాని గూడు ఇంటి లోపల ఉండకూడదు. ఇలా అయితే మాత్రం అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. పావురం రాకను శుభ సంకేతంగా భావిస్తారు.
చిలుక:
ఇంట్లోకి చిలుక రాక కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. జ్ఞానం, శుభ సంభాషణకు చిహ్నంగా ఉండే చిలుకను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచితే జ్ఞానం , శ్రేయస్సుకు ద్వారాలు తెరుచుకుంటాయి.
కుక్క:
మీ ఇంటి చుట్టూ తరచుగా కుక్క వచ్చి ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే.. అది మీ ఇంటి శక్తిని కాపాడుతుంది. రక్షణ కోసం పనిచేస్తుంది. అంతే కాకుండా కుక్క మీ చుట్టూ సానుకూల వైబ్‌లను వ్యాపింపజేస్తుంది. మీరు ప్రతిరోజూ దానికి ఆహారం ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి . అంతే కాకుండా దానికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకండి.
Also Read: శని, రాహు యుతి.. రాబోయే 51 రోజులు మీకు ఎలా ఉండబోతుందంటే ?
ఈ జంతువులు, పక్షుల రాకను అశుభంగా భావిస్తారు ?
పౌరాణిక నమ్మకాలలో.. కాకి పూర్వీకులకు మధ్య సంబంధం ఉండని చెబుతారు. కానీ కాకి పదే పదే కనిపించడం లేదా దాని శబ్దం ప్రతికూల శక్తికి లేదా రాబోయే ఏదైనా ఇబ్బందికి సంకేతం కావచ్చు. మీ ఇంటి పైకప్పుపై కాకి నిరంతరం ఎగురుతూ ఉంటే.. ఇంట్లో ఏదో చెడు జరిగిందని లేదా ఏదైనా చెడు వార్తలు రాబోతున్నాయని నమ్ముతారు.
గబ్బిలాలు:
వీటి రాకను కూడా అశుభంగా భావిస్తారు. తలక్రిందులుగా వేలాడుతున్న ఈ జీవి ఎక్కడ కనిపించినా.. దానిని భయం, వ్యాధి, ప్రతి కూలతకు చిహ్నంగా చూస్తారు. అంతే కాకుండా ఇది ఇంట్లో ఉండటం శుభప్రదం కాదు. అందుకే వీటిని ఇంటికి దూరంగా ఉండేలా చూడండి.