E-Paper
Advertisement

Vastu Tips: ఏ దిశలో నిద్రించాలి ? వాస్తు, సైన్స్ చెప్పే విషయాలివే !

Vastu Tips: ఏ దిశలో నిద్రించాలి ? వాస్తు, సైన్స్ చెప్పే విషయాలివే !

Vastu Tips: మనం నిద్రించే దిశ కేవలం సౌకర్యాన్ని మాత్రమే కాదు.. మన ఆరోగ్యం, మానసిక స్థితి, శక్తి ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మన సంస్కృతిలో బలంగా విశ్వసిస్తారు. వేల సంవత్సరాల నుంచి వాస్తు శాస్త్రం, యోగా సాంప్రదాయాలు తల ఉంచే దిశపై కొన్ని మార్గదర్శకాలను అందిస్తున్నాయి. నిద్రించడానికి ఏ దిశ మంచిది ఏ దిశ మంచిది కాదు అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. తూర్పు దిశ :
వాస్తు ప్రకారం: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఈ దిశ శుభప్రదంగా.. సానుకూల శక్తితో  ఉంటుంది. అంతే కాకుండా ఈ దిశలో తల ఉంచి నిద్రిస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని నమ్ముతారు.

ఎవరికి మంచిది: విద్యార్థులు, ఉద్యోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం సూర్యకిరణాలు మన శక్తి చక్రాలపై పడటం ఆరోగ్యకరం.

2. దక్షిణం దిశ:
వాస్తు ప్రకారం: ఈ దిశలో నిద్రించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. యముడి దిశ అయినప్పటికీ.. ఇక్కడ నిద్రించడం స్థిరత్వాన్ని ఇస్తుంది.

శాస్త్రీయ దృక్కోణం: భూమికి ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉన్నాయి. మానవ శరీరానికి కూడా సొంత అయస్కాంత క్షేత్రం ఉంటుంది. మనం తలను ఉత్తరం వైపు పెట్టి నిద్రించినప్పుడు.. భూమి ఉత్తర ధ్రువం, మన తల ధ్రువం వికర్షించుకుంటాయి. కానీ దక్షిణం వైపు తల పెట్టి నిద్రిస్తే.. ఈ అయస్కాంత క్షేత్రాలు సమతుల్యంగా ఉంటాయి. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

3. పడమర దిశ :
వాస్తు ప్రకారం: ఇది తటస్థమైన దిశగా పరిగణించబడుతుంది. ఇది ఆందోళనను, కలతలను పెంచే అవకాశం ఉన్నప్పటికీ.. కొంతమంది నిపుణులు ఈ దిశను “విజయం”, “పేరు” కోసం మంచిదని సూచిస్తారు.

ఎవరికి మంచిది: లక్ష్యాలను సాధించాలనుకునేవారికి ఈ దిశలో నిద్రించడం మంచిది.

4. ఉత్తరం దిశ:
వాస్తు ప్రకారం: ఈ దిశ అశుభం. ఈ దిశలో నిద్రిస్తే దురదృష్టం, అనారోగ్యం కలుగుతాయని నమ్ముతారు.

శాస్త్రీయ దృక్కోణం: ఇది అత్యంత ముఖ్యమైన కారణం. మీరు తల ఉత్తరం వైపు ఉంచి నిద్రిస్తే, భూమి యొక్క శక్తివంతమైన ఉత్తర అయస్కాంత ధ్రువం మీ మెదడులోని రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈ దిశలో నిద్రించకూడదు. ఇది గుండె, రక్త ప్రసరణపై ఒత్తిడి పెంచుతుందని ఆధునిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×