E-Paper
Advertisement

Anuradha Nakshatra: అనురాధ నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. 3 రాశుల వారికి ధనలాభం

Anuradha Nakshatra: అనురాధ నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. 3 రాశుల వారికి ధనలాభం
Advertisement

Anuradha Nakshatra: రాక్షస గురువు శుక్రుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశి మారుస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గౌరవం, సౌలభ్యం, లగ్జరీ, సంపద, కీర్తికి బాధ్యత వహించే గ్రహంగా చెబుతారు. అక్టోబర్ 16, 2024 బుధవారం.. శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. విశాఖ నక్షత్రంలో ఉన్న శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి మారనున్నాడు. అక్టోబరు 16వ తేదీ అర్ధరాత్రి 12:12 గంటలకు శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి రాశి మార్పు 3 రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆ 3 అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.

గ్రహాల రాశి మార్పు లేదా నక్షత్ర మార్పు 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కొన్ని గ్రహాల మార్పు నిర్ధిష్ట గ్రహాలపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. ఫలితంగా ఆయా రాశుల వారు శుభ లేదా అశుభ ఫలితాలను కూడా పొందుతారు.

Advertisement

వృషభం రాశి:
వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అనుకూల ఫలితాలు తెచ్చిపెట్టింది. ఈ సమయంలో ఉద్యోగస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు ప్రయోజనాలను పొందవచ్చు. వ్యాపారస్తులు తమ కస్టమర్లతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. అంతే కాకుండా కుటుంబ సంబధాలు కూడా పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అంతే కాకుండా పూర్వీకుల ఆస్తుల మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి.

ధనుస్సు రాశి :
శుక్రుడు రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను ఖరారు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పని చేసే చోట అధికారులతో ప్రశంసలు కూడా అందుకుంటారు. అంతే కాకుండా పెట్టుబడులు భారీగా లాభాలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. పాత వ్యాధుల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Also Read: నవంబర్ 15న కుంభ రాశిలోకి శని ప్రవేశం.. 4 రాశుల వారిపై సంపద వర్షం

కుంభ రాశి:
అనురాధ నక్షత్రంలో శుక్రుడి సంచారం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో డబ్బు సమస్యలు తీరుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతంలో ఇంక్రిమెంట్ ప్రయోజనం ఉంటుంది. అధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు.ఈ సమయంలో మీ పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీర చేసే పనుల్లో కూడా విజయం వరిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×