ఆగస్టు నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇది అనేక రాశులకు శుభప్రదంగా ఉండబోతోంది. ఆగస్టులో బృహస్పతి, శుక్రుడు, సూర్యుడు వంటి రాశులు తమ స్థితిని మార్చుకోబోతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఆరు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
బృహస్పతి సంపద, ఆస్తికి కారకుడిగా చెబుతారు. ఇక శుక్రుడు అందానికి, విలాసానికి, ప్రేమకు కారకుడు. వీరిద్దరి కలయిక వల్ల అనేక రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రుడు, బృహస్పతి మాత్రమే కాదు. సూర్యుడు కూడా ఈ నెలలో తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి సంపద, శ్రేయస్సు కలుగుతుంది. అందుకే ఆగస్టు నెలలో ఏ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారో తెలుసుకోండి.
సింహరాశి
ఆగస్టు నెలలోనే సూర్యుడు సింహరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వీరికి కొత్త శక్తి అందుతుంది. విజయాలు దక్కుతాయి. శక్తి స్థాయిలు పెరుగుతాయి. కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా పురోగమనం కనిపిస్తుంది.
కర్కాటక రాశి
ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి ఎంతో మంచి సమయమని చెప్పాలి. ఈ రాశి వారు వ్యాపారం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే ఆగస్టు నెలలో వీరు మానసికంగా బలంగా మారాల్సి ఉంటుంది. డబ్బును కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. కొత్త ఆదాయ వనరులను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే మీకు విజయాలు దక్కుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడు ఎంతో లాభాన్ని అందిస్తాడు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులను కలిగిస్తాడు. ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడు. గత నెలతో పోలిస్తే మీకు ఆగస్టులో మేలే జరుగుతుంది. అనేక ఆర్ధిక లాభాలు మీకోసం వేచి ఉంటాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి అన్ని విధాలుగా ఆగస్టు నెల బాగా కలిసి వస్తుంది. శుక్రుడు, బుధుడు, బృహస్పతి ఆర్థిక విజయాలను అందిస్తాడు. ఉద్యోగం నుండి వ్యాపారం వరకు మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఆగస్టు నెలలో చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి అధిపతి గురుడు. బృహస్పతి ఆగస్టు నెలలో కలిసి ప్రయాణం చేయబోతున్నారు. కాబట్టి ధనస్సు రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఆగస్టు నెలలో సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వారు కోరుకున్నది పొందగలుగుతారు. వ్యాపారమైనా, ఉద్యోగమైనా కూడా విజయం దక్కుతుంది. లక్ష్యాలను సాధించే దిశగా ఎంతో ముందడుగు వేస్తారు.