Mirai Movie: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, జాంబీరెడ్డి సినిమాతో హీరోగా మారారు తేజ సజ్జ (Teja Sajja).ఆ తర్వాత ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా యోధుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’. ఇందులో రితిక నాయక్(Rithik Naik) హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా మంచు మనోజ్ (Manchu Manoj) ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్ గా 2d , 3d ఫార్మాట్ లలో మొత్తం ఎనిమిది భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
” వైబ్ ఉంది బేబీ”.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సింగిల్..
ఇదిలా ఉండగా ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. ” వైబ్ ఉంది బేబీ” అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ తన గాత్రంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇకపోతే ఇందులో తేజ తన అద్భుతమైన ఎనర్జిటిక్ లెవెల్స్ తో రెచ్చిపోయాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతున్నారు మొత్తానికైతే వైబ్ ఉంది బేబీ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది అని చెప్పవచ్చు.
మిరాయ్ మూవీకి బాలీవుడ్ నిర్మాత భారీ డీల్..
ఎప్పుడో ఈ ఏడాది ఏప్రిల్ 18 విడుదల కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్, కొంత సినిమా షూటింగ్ వల్ల సెప్టెంబర్ 5కి విడుదల వాయిదా వేశారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమాకి బాలీవుడ్ లో కూడా జాక్పాట్ తగిలింది అని తెలుస్తోంది. ఈ సినిమా నార్త్ హక్కుల కోసం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే బాహుబలి, దేవరా లాంటి చిత్రాలతో భారీ ప్రాఫిట్స్ చూసిన కరణ్ ఇప్పుడు మిరాయ్ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఈ డీల్ తో బాలీవుడ్ లో తేజా సజ్జ మూవీకి వేరే లెవెల్ అటెన్షన్ క్రియేట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ లెక్కలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా మార్కెట్ పరంగా బ్లాక్ బాస్టర్ హిట్టు కొడుతుంది అని అటు తేజ సజ్జా కి తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అయితే కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత చేతుల్లో పడ్డ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అందుకోవడమే కాదు ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటుందని పలువురు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Pawan Kalyan HHVM: పార్ట్ 2 రావాలంటే అలాంటి కండిషన్స్.. వర్కౌట్ అవుతుందా