BigTV English

Ugadi Pachadi:ఉగాది పచ్చడితో మూడు దోషాలు కంట్రోల్ …ఏంటవి…?

Ugadi Pachadi:ఉగాది పచ్చడితో మూడు దోషాలు కంట్రోల్ …ఏంటవి…?

Ugadi Pachadi:ఉగాది పచ్చడి ఒక మహాఔషధం. ఒక్క ఉగాది రోజే కాదు పచ్చడిని తీసుకుని సరిపెట్టుకో కూడదు. ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణిమ వరకూ ప్రతి రోజూ స్వీకరించాలి. ఈ విధంగా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో ఉండే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి, ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానివ్వదు.. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను కంట్రోల్ చేస్తుంది ఈ ఉగాది పచ్చడి. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటి వల్లే వస్తాయి


ఉగాది కోసం ముందే ఇంటిని శుభ్రంగా చేసుకుంటాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి రోగాలు వ్యాపించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. మామిడి ఆకులు ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ 9 రోజుల పాటూ వసంత నవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్రపౌర్ణమి వరకూ దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి.

శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఝానికి అంశాలను మాత్రమే.


Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×